తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్యర్యంలో జనరంజక పాలన కొనసాగుతున్నదని, మూడోసారి బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ స్పష్టం చేశారు. వచ్చే నెల ఒకటిన ఇల్లందులో జరిగే సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ విజయవంతం కోసం శుక్రవారం ఆమె బయ్యారం మండలకేంద్రంలో రామచంద్రస్వామి ఫంక్షన్ హాల్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో రూ.1800 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సీతారామ ప్రాజెక్టును నిర్మించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశామన్నారు. సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభకు వేలాదిగా పార్టీశ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
బయ్యారం, అక్టోబర్20 : బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. వచ్చే నెల ఒకటిన ఇల్లందులో జరిగే సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ విజయవంతం కోసం శుక్రవారం ఆమె బయ్యారం మండలకేంద్రంలోని కోదండ రామచంద్రస్వామి ఫంక్షన్ హాల్లో మండల నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ జనరంజక పాలన అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి అండగా నిలిచారని తెలిపారు. అభివృద్ధికి ఆమడదూరంలో ఉ న్న ఇల్లందు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలు సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయాలతో నేడు అభివృద్ధిపథంలో పయనిస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో రూ.1800 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ఇల్లందు ప్రజల చిరకాలవాం ఛ అయిన బస్సు డిపోను ఏర్పాటు చేసుకోగలిగామన్నా రు. అదేవిధంగా లక్ష ఎకరాలకుపైగా సాగు నీరందించి, నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేలా తలపెట్టిన సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణం బీఆర్ఎస్తోనే సాధ్యమైందని తెలిపారు.
బయ్యారం పెద్దచెరువు ఎత్తు రెండు అడుగులకు పెంచి, సీతారామ ప్రాజెక్టు నీటితో నింపి గార్ల, బయ్యారం రైతాంగానికి లబ్ధి చేకూరుస్తామన్నా రు. అందుకోసం అదనంగా రూ.3,320 కోట్లు మం జూరు చేశారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వంద శాతం సీసీ, బీటీ రోడ్లను పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఇల్లందు అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని తెలియజేసేలా ప్రతి ఒక్కరూ ప్రజాఆశీరాద్వ సభకు తరలిరావాలని కోరారు. సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమని, మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ బిందు మాట్లాడుతూ.. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, బీసీబంధు, మైనారిటీ బంధు, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, డబుల్ బెడ్రూం ఇండ్లు, గృహలక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పోడు భూములకు పట్టాల పంపిణీ వంటి అనేక పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్నదన్నారు.
వీటిని కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని కోరారు. ఇల్లందులో జరిగే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలన్నారు. బయ్యారం మండలం నుంచి సుమా రు పది వేలమందిని ఈ సభకు తరలించేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియానాయక్ భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామన్నారు. అనంతరం బయ్యారం బస్టాండ్ సెంటర్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ ప్రారంభిచారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తాత గణేశ్, పీఏసీఎస్ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు బానోత్ మురళీకృష్ణ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రేఖ ఉప్పలయ్య, మండల అధికార ప్రతినిధి సంకు సత్తిరెడ్డి, ఆత్మ కమిటీ జిల్లా మెంబర్ ఏనుగుల ఐలయ్య, బానో త్ శ్రీనూనాయక్, ఎంపీటీసీ కుమారి, కవిత, సర్పంచ్‌లు మమత, వెంకన్న, నాయకులు వీరన్న, వెంకటప తి, లక్ష్మణ్ నాయక్, ఆర్వీ, తొట్టి కృష్ణ, అనిల్, బాబు, రవి, రాము, రమేశ్, వీరన్న, సురేశ్ పాల్గొన్నారు.