ఆళ్లపల్లి, ఫిబ్రవరి 21 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి అడవుల్లో పెద్దపులి అడుగుజాడలు కలకలం రేపాయి. లక్ష్మీపురం శివారులో పనికి వెళ్తున్న రైతులు పులి అడుగులను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు.
ఆళ్లపల్లి ఫారెస్ట్ రేంజర్ కిరణ్‌కుమార్ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లి పులి అడుగులను గుర్తించారు. పెద్దపులి రేగళ్ల రేంజ్ నుంచి ఆళ్లపల్లి రేంజ్‌లోకి ప్రవేశించిందని, రేంజ్ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల కరకగూడెం, పినపాక మండలాల్లో పెద్దపులి సంచరించినట్టు వెల్లడించారు.