హనుమకొండ, మే 30 : జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పరీక్ష నిర్వహణపై గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష పూర్తయ్యేంత వరకూ నిరంతర నిఘా పెట్టాలన్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి, ఆర్డీవో వెంకటేశ్, ఆర్టీసీ డీఎం ధరం సింగ్ పాల్గొన్నారు.