గీసుగొండ,ఫిబ్రవరి 05 : వరంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరిలోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌ను (Model school)బుధవారం జిల్లా కలెక్టర్ సత్య శారద(Collector Satya Sarada) ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారంగా మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. కూరగాయలను పరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉంచాలని నేలపై నిల్వ చేయరాదని సూచనలు చేశారు. నాణ్యతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు. పరిశుభ్రత పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సునీత పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Actress Pushpalatha | తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి పుష్పలత కన్నుమూత..
Mallikarjun Kharge | ‘నేను నీ అయ్య సహచరుడిని.. నోరు మూసుకుని కూర్చో..’ బీజేపీ ఎంపీపై ఖర్గే అసహనం
Shirdi | షిర్డీలో చెలరేగిన దొంగలు.. ఇద్దరు ఆలయ ట్రస్ట్ ఉద్యోగులు మృతి, మరొకరికి గాయాలు