హమిల్టన్: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న న్యూజిలాండ్.. తొలి పోరులో ఓడినప్పటికీ రెండో మ్యాచ్‌లో సత్తాచాటింది. బ్యాట్‌తో డెవాన్ కాన్వే (49 బంతుల్లో 60, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా బంతితో బెన్ సీర్స్ (3/14), లాకీ ఫెర్గూసన్ (3/16) తలా మూడు వికెట్లు పడగొట్టడంతో సౌతాఫ్రికాపై ఆ జట్టు 68 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. కాన్వే రాణించడంతో 20 ఓవర్లకు 175/6 స్కోరు చేసింది.
పేస్, బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్లు చెలరేగడంతో సఫారీలు 15.3 ఓవర్లకు 107 రన్స్‌కే కుప్పకూలారు. జార్జ్ లిండె (12 బంతుల్లో 33, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా మిగిలినవారంతా తేలిపోయారు. ఇరుజట్ల మధ్య శుక్రవారం మూడో టీ20 ఆక్లాండ్‌లో జరుగుతుంది.