Shirdi | షిర్డీలో చెలరేగిన దొంగలు.. ఇద్దరు ఆలయ ట్రస్ట్ ఉద్యోగులు మృతి, మరొకరికి గాయాలు
Shirdi | ప్రసిద్ధ సాయిబాబా ఆలయం ఉన్న షిర్డీలో దొంగలు చెలరేగిపోయారు. పలు ప్రాంతాల్లో దోపిడీకి యత్నించారు. ఈ నేపథ్యంలో సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు కత్తిపోట్లకు గురై మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ముంబై: ప్రసిద్ధ సాయిబాబా ఆలయం ఉన్న షిర్డీలో (Shirdi) దొంగలు చెలరేగిపోయారు. పలు ప్రాంతాల్లో దోపిడీకి యత్నించారు. ఈ నేపథ్యంలో సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు కత్తిపోట్లకు గురై మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్ర అహల్యానగర్ జిల్లాలోని షిర్డీలో ఈ సంఘటన జరిగింది. సోమవారం (ఫిబ్రవరి 3) తెల్లవారుజామున షిర్డీలోని పలు ప్రాంతాల్లోని ఇళ్లల్లో దొంగలు చొరబడ్డారు. దోపిడీకి యత్నించే క్రమంలో కొందరు వ్యక్తులపై కత్తులతో దాడి చేశారు.
కాగా, సాయిబాబా ఆలయాన్ని నిర్వహించే ట్రస్ట్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులైన 43 ఏళ్ల సుభాష్ సాహెబ్రావ్ ఘోడే, 45 ఏళ్ల నితిన్ కృష్ణ షెజుల్, దొంగల కత్తిపోట్ల వల్ల మరణించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకృష్ణ నగర్‌కు చెందిన కృష్ణ దేహార్కర్పై కూడా ఆ దుండగులు కత్తితో దాడి చేయగా అతడు గాయపడినట్లు చెప్పారు. దొంగలు గంట వ్యవధిలో మూడు చోట్ల దాడులకు పాల్పడినట్లు వెల్లడించారు.
మరోవైపు ఈ సంఘటనలకు సంబంధించి షిర్డీలోని శ్రీరామ్ నగర్‌కు చెందిన కిరణ్ న్యాండియో సదా కులేను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మిగతా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దోపిడీ కోసమే కత్తి దాడులు జరిగాయని, మరే ఇతర కారణాలు లేవని పోలీస్ అధికారి స్పష్టం చేశారు. నిందితులపై గతంలో కూడా పలు కేసులు నమోదైనట్లు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

