భూపాల్ పల్లి రూరల్ మే 05: ప్రజావాణిలో ప్రజలు అందజేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకుని దరఖాస్తులు స్వీకరించారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో 52 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజావాణి ప్రధాన ఉద్దేశం ప్రజల ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పరిష్కారం చేయడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.