హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 11: బాగా చదివి ఉద్యోగం సాధించాలని పోటీ పరీక్షల ప్రిపేరవుతున్న అభ్యర్థులతో కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హనుమకొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. ఈ సందర్భంగా లైబ్రరీలోని అన్ని విభాగాలను ఆమె పరిశీలించారు. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులతో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గ్రంథాలయంలో నెలకొన్న సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. గ్రంథాలయం పక్కన నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని ఆమె సందర్శించారు. పనులు నిలిచిపోవడంపై కలెక్టర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహ్మద్ అజిజ్ఖాన్, లైబ్రేరియన్లను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయాన్ని సందర్శించినట్లు పుస్తకంలో కలెక్టర్ పేరు రాయడం కొసమెరుపు.