కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు షురూ
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొత్త జీవితాలను ప్రసాదిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా నిలుస్తున్న ఎంజీఎం దవాఖాన మరో మైలురాయిని దాటింటి.
- ఎంజీఎం దవాఖాన పరిధిలో తొలి సర్జరీ సక్సెస్
- హైదరాబాద్ కోఠి ఈఎన్టీ హాస్పిటల్ తర్వాత ఇక్కడే..
- మూడేళ్ల బాలుడికి సర్జరీ చేసిన వైద్యులు
- రూ.5.5లక్షలతో యంత్రాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
- ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్స వినికిడి లోపం ఉన్న చిన్నారులకు వరం
వరంగల్ చౌరస్తా, ఆగస్టు 28 : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొత్త జీవితాలను ప్రసాదిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా నిలుస్తున్న ఎంజీఎం దవాఖాన మరో మైలురాయిని దాటింటి. సోమవారం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను ఎంజీఎం అనుసంధానంగా పని చేస్తున్న కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రారంభించింది. వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం రంగశాయిపేట ప్రాంతానికి చెందిన కౌటం శ్రవన్, సృజన దంపతుల కుమారుడు కౌటం కుశన్(3)కు ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ పరుశురాం, హైదరాబాద్ కోఠి ఈఎన్టీ హాస్పిటల్ మెంటార్ సర్జన్ డాక్టర్ శంకర్, డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో మూడు గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ పరుశురాం మాట్లాడుతూ జూలై నెలలో జరిగిన ఆరోగ్యశ్రీ ట్రస్టు కమిటీ సమావేశంలో హైదరాబాద్ కోఠి హాస్పిటల్లో మాత్రమే నిర్వహిస్తున్న కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను ఎంజీఎం దవాఖానలో సైతం నిర్వహించాలని తీర్మానించినట్లు తెలిపారు. ఈ మేరకు పుట్టుకతో వినికిడి లోపం కలిగి ఉన్న చిన్నారులకు శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఆగస్టు 24న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరిన కౌటం కుశన్ను ఎంపిక చేసి, విజయవంతంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిపారు.
త్వరలోనే అతడికి స్పీచ్ థెరపీ విధానం ద్వారా మాట్లాడేలా చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. వినికిడి శక్తి లోపం కారణంగా శబ్దాలను గుర్తించకపోవడం వల్ల చాలా మంది చిన్నారులు మూగ, చెవిటి దివ్యాంగులుగా జీవిస్తున్నారన్నారు. వారి జీవితాల్లో వెలుగు నింపడానికి సృష్టించిందే ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ పరికరమని తెలిపారు. రూ.5.5లక్షల విలువైన ఈ యంత్రం వినికిడి లోపంతో పుట్టిన చిన్నారులకు ఒక వరమన్నారు. శస్త్రచికిత్స ద్వారా చెవిలో ఏర్పాటు చేసిన ఈ యంత్రం శ్రవణనాడి ద్వారా మెదడుకు సంకేతాలను పంపించి శబ్దాలను గుర్తించేలా చేస్తుందన్నారు. దీంతో చిన్నారులు తమ కంఠస్వరం ద్వారా తిరిగి శబ్దాలను సృష్టించి మాట్లాడగలిగేలా చేయవచ్చన్నారు. సుమారు రూ.పది లక్షల ఖర్చుతో కూడుకున్న ఈ వైద్యసేవలను తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందిస్తుందని పేర్కొన్నారు. మొదటి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందంలోని డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ లక్పతి, డాక్టర్ విజయ్, అనస్తీషియా వైద్యులు డాక్టర్ ప్రవీణ్‌కుమార్, డాక్టర్ మురళి, డాక్టర్ చంద్రశేఖర్ కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్‌రావు, జిల్లా ఆరోగ్యశ్రీ అధికారి డాక్టర్ కమల్చంద్నాయక్, తదితరులు శస్త్రచికిత్సను పర్యవేక్షించారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యస్థితిని పరిశీలించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

