మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 2 : అతి భారీవర్షాలతో అతలాకుతలమైన మహబూబాబా ద్ జిల్లాలో మంగళవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా నుంచి రోడ్డుమార్గంలో మానుకోటకు చేరుకోనున్నారు.
డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి సమీపంలోని సీతారాంతండాను సందర్శించి అక్కడి ప్రజల తో మాట్లాడనున్నారు. భారీ వర్షానికి కొట్టుకుపోయిన బ్రిడ్జి, రోడ్డును పరిశీలించనున్నారు.