బోధన్, ఫిబ్రవరి 26: బెంగళూరు నగర శివారులో వినూత్నంగా పూలవనాలను సాగుచేస్తున్న నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం నాగన్పల్లివాసి బొల్లేపల్లి శ్రీకాంత్‌కు ‘ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు’ వరించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ (ఐసీఏఆర్) ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన పూసా విజ్ఞాన్ మేళా లో శుక్రవారం శ్రీకాంత్‌కు ఐసీఏఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ పరోడా అవార్డును అందించారు.
జీవనోపాధి కోసం 25 ఏండ్ల క్రితం బెంగళూరుకు వెళ్లిన శ్రీకాంత్ డెకరేషన్‌కు వినియోగించే వినూత్నమైన పూలరకాలను 70 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ పూల ను దుబాయ్‌తో పాటు అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అగ్రి బిజినెస్‌మాన్‌గా వెన్శాయ్ ఫ్లోరిటెక్ పేరిట ఆయన చేస్తున్న పూల ఎగుమతులతో గతేడాది బిజినెస్ టర్నోవర్ రూ.70 కోట్లకు చేరింది.