అగ్ర హీరో మహేష్‌బాబు సోదరుడి కుమారుడు జయకృష్ణ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్ భూపతి దర్శకుడు. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కమార్తె రషా తడాని కథానాయికగా నటిస్తున్నది. పి. కిరణ్ నిర్మాత. ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్‌బాబు కీలక పాత్రను పోషిస్తున్నారు. వెంకటప్పయ్య నాయుడుగా ఆయన పాత్ర తాలూకు ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు.
ఇందులో ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ఊరి పెద్దగా అధికార దర్పంతో కనిపిస్తున్నారు. గొప్ప సంకల్పంతో తన నేలను పాలించే వ్యక్తిగా వెంకటప్పయ్య నాయుడు పాత్ర అందరిని ఆకట్టుకుంటుందని, ప్రస్తుతం సినిమా చిత్రీకరణ జరుగుతున్నదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, నిర్మాణ సంస్థ: చందమామ కథలు, సమర్పణ: అశ్వినీదత్, రచన-దర్శకత్వం: అజయ్ భూపతి.