జనగామ, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : ఎన్నిక ల నగారా మోగగానే బీఆర్ఎస్ దూకుడు పెంచింది. సీఎం కేసీఆర్ 16న జనగామలో జరిగే సభలో పాల్గొన నున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి తొలి ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచే పూరించే అవకా శం ఉన్నది. సీఎం పర్యటన ఖరారు కావడంతో బీఆర్ఎ స్ శ్రేణుల్లో నయా జోష్ మొదలైంది. సీఎం బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బుధవారం జిల్లా కేంద్రంలోని వికాస్‌నగర్‌లో ఉదయం 11 గంటలకు స న్నాహక సమావేశం సహా జనగామ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో కీలక సమన్వయ సమావేశం జరుగను న్నది. రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజే శ్వర్రె డ్డి, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజ రుకానున్నారు. ఒకనాడు కరువుగడ్డగా ఉన్న జనగామ కోనసీమ తరహాలో పచ్చగా చేసిన అభివృద్ధి ప్రదాత కేసీఆర్ రానుండడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది. తొలి జాబితాలోనే పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూ ర్కు ఇద్దరు దమ్మున్ననేతల పేర్లను ప్రకటించిన అధినేత, తాజాగా జనగామ స్థానం నుంచి పల్లా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో జిల్లాలో గులాబీ పార్టీ మూడు సీట్లు గెలిచి ‘తీన్మార్’ కొట్టేందుకు సిద్ధమైంది. ఆయా నియో జకవర్గాల్లో జనంలో పట్టున్న వారికే బీఆర్ఎస్ అభ్యర్థు లుగా పట్టం గట్టడడంతో గెలుపు ఖాయమైనా..మెజార్టీ లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ మేరకు సీఎం ఎన్నికల బహిరంగసభ, సన్నాహక సభ కోసం అక్కడే మైదానాన్ని చదును చేస్తున్నారు. సీఎం సభాస్థలి వద్ద బందోబస్తు, హెలిప్యాడ్ వంటి ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం జనగామ ఏసీపీ దేవేందర్ రెడ్డి, అర్బన్ సీఐ శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు.
ఇప్పటికే గులాబీ పార్టీ మిగతా పార్టీల కంటే ముందే టికెట్లు ఖరారు చేసి సమరానికి సై అంటూ కదన రంగంలోకి దూకింది. ఇంకా ఎవరికి ఇవ్వాలో తేల్చుకు నేలోపే మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్యక్రమా లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి నియోజక వర్గాల్లో విస్తృత పర్యటనలు చేపట్టారు. అర్ధరాత్రి వరకు బిజీబిజీగా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రూ.వందల కోట్ల పనులు చేపట్టారు. షెడ్యుల్ వచ్చే వర కు ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారానికి ప్ర యత్నం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆగకూడదని పేదలకు ఇబ్బందులు కలిగించొద్దని దళితబంధు, గృహ లక్ష్మి, బీసీబంధు కార్యక్రమాలతో క్యాంపు కార్యాలయా లు జనంతో నిండిపోయాయి. కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇస్తూ వందల మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందు కు క్యూ కడుతున్నారు. 2018లో గులాబీ పార్టీని ఆద రించినట్లుగానే ఈసారి ఎన్నికల్లోనూ జిల్లా ప్రజలు బీఆ ర్ఎస్ వెంటే ఉంటారన్న విశ్వాసాన్ని గులాబీనేతలు వ్యక్తం చేస్తున్నారు.