ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన నీరాజనం పలికారు.. వనపర్తి జిల్లాలో మంగళవారం సీఎం పర్యటించారు.. పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు.. బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.. ప్రాజెక్టులను
పూర్తి చేసుకోవడంతో ఒకప్పటి కరువు నేల అయిన పాలమూరు నేడు వజ్రపుతునకలా మారిందన్నారు.. వలసల ఖిల్లాగా ఉన్న చోటకే వేరే రాష్ర్టాలు, జిల్లాల నుంచి వచ్చి బతుకున్నారని చెప్పారు..
– నెట్వర్క్, నమస్తే తెలంగాణ
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువును తట్టుకోలేక అన్నదాతలు వలసలు వెళ్తుంటే విలపించిన కరువు నేల.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రూపురేఖలు మారిందో సీఎం కేసీఆర్ పాట పాడి వినిపించారు. స్వయంగా తానే రాసిన ఈ పాట
నాటి పాలమూరు దుస్థితికి.. నేటి మార్పునకు అద్ధం పడుతున్నది.
వలసలతో వలవల విలపించిన కరువు జిల్లా..పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తిచేసి ..చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి..పాలమూరు తల్లి పచ్చని పైట కప్పుకొన్నది…
వనపర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ‘మన ఊరు-మన బస్తీ-మన బడి’ కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు రాములు, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్ షేక్‌యాస్మిన్‌బాషా