ఖానాపురం, ఏప్రిల్ 23 : హరితహారంలో భాగంగా ఈ సంవత్సరం జిల్లా లో 25.92 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. శనివారం మండలంలోని పాకాలలో వివిధ శాఖ ల జిల్లా అధికారులతో హరితహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తొ లుత కలెక్టర్ అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన అతిథి గృహాన్ని ప్రారంభించారు. సీతాకోకచిలుకల పార్కును పరిశీలించారు. పాకాల కట్ట దిగువ ప్రాం తంలో మొక్కలు నాటారు. అనంతరం శాఖల వారీగా మొక్కలు నాటేందుకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు పొలం గట్లపై నాటుకునేందుకు కేవలం టేకు మొక్కలు మాత్రమే అం దించాలని జేడీఏ ఉషాదయాళ్ కోరా రు. కేవలం టేకు మొక్కలు మాత్రమే కాకుండా ఇతర మొక్కలు కూడా నాటే లా చూడాలని కలెక్టర్ సూచించారు. టేకు మొక్కలు కావాల్సిన రైతుల వివరాలు అందజేస్తే పరిశీలిస్తామన్నారు. జిల్లాలో 323 నర్సరీల్లో 41 లక్షల మొక్కలను పెంచుతున్నామన్నారు.
జిల్లాలో త్వరలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారని కలెక్టర్ తెలిపారు. పాకాల అడవులకు పూర్వవైభవం తీసుకురావాలన్నారు. హైవేల వెంట ఇరువైపులా మొక్కల నాటాలన్నారు. మొక్క ల సంరక్షణకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ‘మన ఊరు మన బడి’కి ఎంపికైన పాఠశాలలకు ప్రహరీలు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. పాఠశాలల్లో ఎలాంటి మొక్క లు నాటాలో నిర్ణయించాలన్నారు. నూతనంగా పోడు చేస్తే ఊరుకునేది లేదని, క్రిమినల్ కేసులు సైతం నమో దు చేస్తామని హెచ్చరించారు. నర్సంపేట ప్రాంతంలో కొన్నిచోట్ల గంజాయి సాగవుతున్నట్లు సీఎం దృష్టికి వెళ్లిందని, సాగుదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీఎం హెచ్చరించినట్లు తెలిపారు. గంజాయి, గుడుంబా నిర్మూలనకు ఎక్సైజ్ అధికారులు కృషి చేయాలన్నారు. నర్సంపేట పట్టణంలోని డివైడర్లలో పిచ్చిమొక్కలు మొలిచాయని, వాటిని తొలగించి పూల మొక్కలు నాటాలని కమిషనర్‌కు ఆదేశించారు. మే 20 నుంచి జూన్ 20 వరకు పల్లె, పట్టణ ప్రగతి ప్రారంభం కాబోతున్నదని, అధికారులు సిద్ధంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అన్నారు. సమావేశంలో డీఎఫ్‌వో అర్పణ, డీపీవో స్వరూపారాణి, డీఈ వో వాసంతి, డీసీవో సంజీవరెడ్డి, డీఆర్డీవో సంపత్‌రావు, ఆర్డీవో పవన్‌కుమా ర్, తహసీల్దార్ జూలూరి సుభాషిణి, ఎంపీడీవో సుమనావాణి, ఏసీడీపీవో విద్య, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, ఎఫ్ఆర్వో రమేశ్, డీఆర్వో మోహ న్ తదితరులు పాల్గొన్నారు.