‘బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు గెలిస్తే రైతుబంధు రూ.16వేలు వస్తది.. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు మాయమవుతది.. ఏది కావాలో మీరే తేల్చుకోవాలె.. పాలకుర్తి పోరాటాల పురిటి గడ్డ.. ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలె’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో తొర్రూరు పట్టణంలోని నెల్లికుదురు క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం నిర్వహించిన పాలకుర్తి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏసీ రూముల్లో ఉండే వాళ్లు కావాలా? ఎప్పుడూ ప్రజల కోసం ఎండలో ఉండే ఎర్రబెల్లి కావాలా నిర్ణయించుకోవాలని సూచించారు. మంచి ప్రభుత్వం వస్తేనే ఐదేండ్లు ప్రజలకు మంచి జరుగుతుందని, ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల గుణగణాలను చూసి, అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్ర చూసి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ప్రజల కష్టాల్లో పాలుపంచుకోని కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పుడొచ్చి ఏదో చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని, కరోనా కష్టకాలంలో పాలకుర్తి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
మహబూబాబాద్, నవంబర్ 14(నమస్తే తె లంగాణ) : బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు గెలిస్తే రైతుబంధు వస్తుందని, కాంగ్రెస్ గె లిస్తే రైతుబంధు మాయమవుతుందని ఏది కావా లో తేల్చుకోవాలని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. తొర్రూరు పట్టణంలోని నెల్లికుదురు క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం నిర్వహించిన పాలకుర్తి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు తండోపతండాలుగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఎన్నికల్లో నిలబ డే అభ్యర్థుల గుణగణాలను చూస్తూనే, అభ్యర్థి వె నుక ఉన్న పార్టీల చరిత్రను చూసి ఓటేయాలని పి లుపునిచ్చారు. ‘ప్రభుత్వం మంచిదైతే వచ్చే ఐదేం డ్లు ప్రజలకు మంచి అయితది. ఒకవేళ ప్రభుత్వం బాగాలేకుంటే వచ్చే ఐదేండ్లు ఆగమాగమైతది.. మీ గ్రామాలకు, తండాలకు, బస్తీలకు వెళ్లిన త ర్వాత నేను చెప్పిన మాటలను చర్చకు పెట్టండి. ప్రలోభాలకు గురై ఓట్లు వేయవద్దు. మీరు వేసే ఓటు మీ తలరాతను మారుస్తుంది. ప్రజలు ఆలోచించి, నిజ నిజాలు గమనించి ఎప్పుడైతే ఓట్లేస్తరో అప్పుడే ప్రజలు గెలుస్తరు. ప్రజలు గెలిసేదే నిజమైన ప్రజాస్వామ్యం. పార్టీల చరిత్ర, నడవడిక చూడాలె. వాళ్లకు అధికారం ఇస్తే ఏం జేసిండ్రు, ఏం చేస్తరనేది కూడా చూడాలె’ అని విజ్ఞప్తి చేశా రు. ‘బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ హకుల కో సం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల ను కాపాడడం కోసం. తెలంగాణ వచ్చినప్పుడు పాలకుర్తి ఎట్లా ఉండేదో ఆలోచించాలె. ఇవ్వాల జరిగిన అభివృద్ధిని చూడండి. బీఆర్ఎస్ ప్రభు త్వం ఏర్పడక ముందు పాలకుర్తి నుంచి వేలాది మంది బతుక పోయిండ్రు.
ఇవ్వాల పాలకుర్తికే వేరే రాష్ట్రం వాళ్లు నాట్లేయడానికి, పనిచేయడానికి వస్తా ఉన్నరు. ఉద్యమ సమయంలో పాలకుర్తికి చాలా సార్లు వచ్చిన. ఆరోజు ఎస్సారెస్పీ కాలువల్లో గడ్డి, తుమ్మ చెట్లు మొలిచి, కూలిపోయి ఉం డె. నీళ్లొస్తయని ఎవరికీ ఆశలు లేకుండె. ఆనాడు దేవాదుల పూర్తి కాలేదు. తెలంగాణ సాధించుకొని మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక దేవాదులను పూర్తి చేసి, కాళేశ్వరం కట్టి నీళ్లు తీసుకొస్తే పాలకుర్తిలో లక్షా ముప్పై ఐదు వేల ఎకరాలకు నీరంది అద్భుతమైన పంట పండుతున్నది. ఇవ్వాల బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నది. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కు మార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడు. దయాకర్ రావు గెలిస్తే రైతుబంధు రూ.16 వేలు అయితది. కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు మాయమైతది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే మో రైతులకు 3 గంటల కరెంటు చాలంటున్నడు. పీసీసీ అధ్యక్షుడే 3 గంటల కరెంటు చాలని బల్ల గుద్ది చెబుతున్నడు. కేసీఆర్‌కు ఏం తెల్వది, 10 హెచ్‌పీ మోటరు పెట్టుకుంటే గంటకు ఎకరం పొలం పారుతది.. మూడు గంటలు చాలు అంటుండు. ఆగమాగమై ఓ ట్లు వేస్తే ఆ తర్వాత కేసీఆర్ కూడా ఏం చేయలేడు. మీ తండాలకు, గ్రామాలకు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు బాగుచెయ్యడానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా దయాకర్ రావు ఎంతో కృషి చేసిండు. మిషన్ భగీరథ మంత్రి కూడా దయాకర్ రావే. నల్లా నీళ్లు వచ్చేలా చూస్తున్నడు. ఇవ్వాల నీళ్ల బాధ లేకుండా చేసినం.
మా తండా లో మా రాజ్యం కావాలని గిరిజనులు దశాబ్దాల తరబడి కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా?. ఇవ్వాల బీఆర్ఎస్ ప్రభుత్వమే పాలకుర్తి నియోజకవర్గంలో 49 గ్రామాలను పంచాయతీలుగా ఏ ర్పాటు చేసింది. గిరిజన బిడ్డలే సర్పంచులై రాజ్యమేలుతున్నరు. గిరిజనుల రిజర్వేషన్లను పెంచుకు న్నం. దళిత బంధు మాదిరిగా భూమి, ఉద్యోగం, ఆసరా లేకుండా ఉన్న గిరిజన బిడ్డలందరికీ ‘గిరిజన బంధు’ను తప్పకుండా అమలు చేస్తాం. దళి త బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్, బీ ఆర్ఎస్ పార్టీ. విడుతలవారీగా అందరికీ తప్పకుం డా వస్తుందని మనవి చేస్తున్నా. దయాకర్ రావు ను గెలిపించండి. పాలకుర్తికి ఇంజినీరింగ్ కాలేజీ ఉరికురికి వస్తది. పాలకుర్తి నియోజకవర్గంలో పే దలు, దళితులు, గిరిజనులు ఎకువగా ఉన్నరు కాబట్టి దయాకర్ రావు కోరిక మేరకు మొదటి రెం డేండ్లలోనే ప్రతి గ్రామానికి వంద, వంద యాభై ఇండ్లను మంజూరు చేస్తా. మీ అభ్యర్థి పేరు దయాకర్ రావు కాదు..చెక్ డ్యాంల రావు అని పేరు పె ట్టాం. చెక్ డ్యాంల ఏర్పాటుతో భూగర్భ జలాలు పెరిగినయ్. బోర్లు అద్భుతంగా నీళ్లనిస్తున్నయ్. దేవాదాయ భూములు, మండలాలు.. ఇంకా చిన్న చిన్న పనులన్నీ ఈజీగా చేసుకుందాం. ఇది పోరాటాల పురిటి గడ్డ. పోతన గారు పుట్టినటువంటి గడ్డ. బందగీ, దొడ్డి కొంరయ్య, చాకలి ఐలమ్మ కూడా పుట్టిన గడ్డ.
మీరందరూ పోరాటానికి వారసులు. నవంబర్ 30న దయాకర్‌రావు గెలిచిన తర్వాత జోరు గా సీటీలు కొడుదాం. నేను చెప్పిన విషయాలు మన బతుకులకు సంబంధించినవి. మంచిగ ఉన్న తెలంగాణను నాడు చెడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ కాదా. ఆనాడు మనమంతా గొడగొడ ఏడ్చినం. చివరకు పశువులకు గడ్డి లేకుంటే సాదుకోలేక కబేళాలకు అమ్ముకున్న పరిస్థితి. ఎట్లా ఉండె కరెంటు.. రాత్రిపూట జరసేపు, పొద్దాక జరసేపు, అది పెట్టబోయి పాములు కరిచి చచ్చిపోవడం లాంటి బాధలన్నీ ఇవ్వాల పోగొట్టి నం. నిన్నియ్యాల్నే కొంచం కొంచం మొఖం తెలివైతావున్నం. ఈ మొఖం తెలివయ్యి తెలంగాణ మరింత తెలివికి రావాలె గానీ మనం ఇంక వెనుకకు పోవద్దు. పాలకుర్తిలో ఏం జరుగుతుందో నా కు తెలుసు. అమెరికా నుంచి విమానంల వచ్చి ఐదు రోజులు మురిపించేటోళ్లు మనకు రేపు నెత్తిల కిరీటం పెడుతరా.. టోపీ పెట్టి మల్ల విమానం ఎ కుతరు తప్ప ఇకడ ఉండరు. కరోనా వచ్చినా.. ఇంకోటి వచ్చినా.. పొద్దాక, తెల్లందాకా మీ మ ధ్యన ఉండి మీ కోసం తన్లాడే వ్యక్తి దయాకర్ రావు. ఆయనను గెలిపించుకుంటే వంద శాతం మళ్ల మన గవర్నమెంటే వస్తది.
పాలకుర్తి సమావేశంలో దాదాపు లక్షమంది కనుచూపు మేరలో కనిపిస్తా ఉన్నరు. మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పార్టీ, తెలంగాణ కోసం ప్రాణాలియ్యడానికి సిద్ధపడ్డ పార్టీ, వందల మంది బలై తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కార్యకర్తలు, యువకులు ప్రతి ఒక ఓటును పోల్ చే యించి, పార్టీ గెలుపు కోసం పనిచేయాలి. కారు గుర్తుకే ఓటేసి, బీఆర్ఎస్నే గెలిపించాలని మిమ్మ ల్ని కోరుతావున్నా’నంటూ ముగించారు. సభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, బానోత్ శంకర్‌నాయక్, రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్ట ర్ ఎన్.సుధాకర్‌రావు, జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, మాజీ స్పీకర్ కే మధుసూదనాచారి, నూకల నరేశ్‌రెడ్డి, ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, తొర్రూరు మున్సిపల్ పాలకవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు మంత్రి దయాకర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరగా వారికి సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు.