2014 ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల్లి గ్రామాల వద్ద పార్కును స్థాపించే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. 1.50 లక్షల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రూ.1,150 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పార్కు నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే రూ.3,100 కోట్లతో పలు కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేయగా, ప్రత్యక్షంగా 23 వేల మందికి… పరోక్షంగా మరో 23 వేల మందికి ఉపాధి లభించింది.
వరంగల్, నవంబర్ 8(నమస్తేతెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాట తప్పరు మడిమ తిప్పరు. ఉద్యమనేతగా ఆయన ప్రజలకు చెప్పినవెన్నో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కార్యరూపం దాల్చాయి. సమైక్య రాష్ట్రంలో ఇక్కడి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలెన్నో ఒక్కొక్కటిగా పారిపోయాయి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ర్టాన్ని ప్రగతి దిశగా పరుగెత్తించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా ముందుకు నడిపారు. తెలంగాణను దేశానికి ది క్సూచిగా తీర్చిదిద్దారు. సాగు, తాగునీటి గోస తీరింది. ప్రాజెక్టుల నిర్మాణంతో వేసవిలోనూ చెరువులు నీటితో నిండి మత్తడి దుంకుతున్నాయి. గతంతో నీరు లేక ప డావు పడ్డ భూములన్నీ ఇప్పుడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా జరుగుతోంది. కరెంటు కష్టాలకూ తెరపడింది. 2014లో శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కో సం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ప్రచార సభల్లో పాల్గొన్న కేసీఆర్ ఇక్కడ దేశంలోనే అతి పెద్ద మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు కోసం ప్రజలకు హామీ ఇచ్చారు. గతంలో వేలాదిమందికి ఉపాధి ఇచ్చిన వ రంగల్లోని ఆజంజాహీ మిల్లు సమైక్య పాలకుల విధానాలతో మూతపడిందని, ప్రత్యామ్నాయంగా మెగా టెక్స్టైల్ పార్కును నెలకొల్పి వరంగల్‌కు పూర్వవైభ వం తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ గెలిచి సర్కారు కొలువుదీరగానే సీఎం కేసీఆర్ టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు అనువైన ప్రదేశం కోసం పలు ప్రతిపాదనలను పరిశీలించారు. చివరకు వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల్లి గ్రామాల వద్ద పార్కును స్థాపించే ప్ర తిపాదనకు ఆమోదముద్ర వేశారు. ఈ ప్రాజెక్టు అంచ నా వ్యయం రూ.1,150.47 కోట్లు. 1.50 లక్షల మం దికి ఉద్యోగాలు కల్పించడం ఈ పార్కు లక్ష్యం. ప్రభు త్వం టీఎస్ఐఐసీ ద్వారా 1,357 ఎకరాల భూములను సేకరించింది. 2017 అక్టోబర్ 22న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. దీనికి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుగా నామకరణం చేశారు. అప్పటినుంచి ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద వస్త్రనగరిగా ఈ టెక్స్టైల్ పార్కును తీర్చిదిద్దే పనిలో తలమునకలైంది.
టెక్స్టైల్ పార్కు కోసం సేకరించిన భూముల్లో వస్త్ర పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక వసతులను కల్పించే బాధ్యతలను టీఎస్ఐఐసీకి సర్కారు అప్పగించింది. ఈ మేరకు నిధులు కేటాయించింది. ఇప్పటికే రూ.706.87 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో రూ.159.27 కోట్లు భూసేకరణ కోసం వె చ్చించింది. రూ.547.60 కోట్లతో మౌలిక వసతులు కల్పించింది. రూ.6.25 కోట్లతో 21.50కిలోమీటర్ల ప్ర హరీ, రూ.60 కోట్లతో అంతర్గత రోడ్లు, రూ.2.56 కో ట్లతో 7.60కిలోమీటర్ల స్ట్రీట్‌లైట్లు, రూ.5.65 కోట్లతో 33/11కేవీ సబ్‌స్టేషన్, రూ.178.64 కోట్లతో 220/132/11కేవీ సబ్‌స్టేషన్ నిర్మించింది. రూ.3 కోట్లతో తాగునీటి సరఫరా ఏర్పాట్లు చేయడంతో పా టు మరో రూ.100 కోట్లతో హనుమకొండ జిల్లా శా యంపేట మండలంలోని చలివాగు ప్రాజెక్టు నుంచి వ స్త్ర నగరికి 12ఎంఎల్డీ తాగునీటి సరఫరా పనులు, రూ.12.40 కోట్లతో అంతర్గత తాగునీటి సరఫరా, రూ.85 కోట్లతో 5ఎంఎల్డీ సీఈటీపీ నిర్మాణం, రూ.94.10 కోట్లతో ఫోర్‌లేన్ ఆర్వోబీ నిర్మాణ పనులు చేపట్టింది. వీటిలో కొన్ని పనులు పూర్తికాగా మరికొన్ని పనులు వివిధ దశల్లో ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.
మంత్రి కేటీఆర్ చొరవతో పార్కులో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశవిదేశీ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే మూడు కంపెనీలు సుమారు రూ.3,100 కోట్లతో వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులు చేపట్టాయి. మొదట నార్త్ ఇండియాకు చెందిన గణేశా ఎకోపెట్, ఎకోటెక్ కంపెనీ ఇక్కడ రూ.588.25 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రెండు యూనిట్ల కోసం టీఎస్ఐఐసీ 50.10 ఎకరాలను కేటాయించింది. 716 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. రెండున్నరేళ్ల క్రితం యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీటి లో ఒక యూనిట్ నిర్మాణం పూర్తయింది. ఇందులో ఉత్పత్తి కూడా మొదలైంది. మరో యూనిట్ నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. కేరళ రాష్ర్టానికి చెందిన కైటెక్స్ గ్రూప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ పార్కులో రూ.1,500 కోట్ల పెట్టుబడులతో 11 వేల మందికి ఉ ద్యోగం కల్పించేందుకు ముందుకొచ్చింది. ఈ కంపెనీ కి టీఎస్ఐఐసీ 191.62 ఎకరాలను కేటాయించింది. మంత్రి కేటీఆర్ ఇక్కడ కైటెక్స్ వస్త్ర పరిశ్రమల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దశలవారీగా ఆరు యూని ట్ల ద్వారా తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చే దిశ గా కైటెక్స్ కంపెనీ ముందుకు వెళ్తున్నది. ఈ కంపెనీ వ స్త్ర పరిశ్రమల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నా యి. త్వరలో ఒక యూనిట్లో ఉత్పత్తిని ప్రారంభించేందుకు కంపెనీ సన్నద్ధం అవుతున్నది. నార్త్‌కొరియా కు చెందిన ఎవర్టాప్ టెక్స్టైల్ అండ్ అపెరల్ కాం ప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పార్కులో రూ.980 కో ట్ల పెట్టుబడులతో 11,700 మందికి ఉద్యోగం కల్పించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక చొర వ చూపిన కేటీఆర్ జూన్ 17న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి వస్త్ర పరిశ్రమల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీకి టీఎస్ఐఐసీ 297.59 ఎకరాలను కేటాయించింది. ఇటీవల కంపెనీ నిర్మాణ పనులనూ చేపట్టింది. ఈ మూడు కంపెనీలు 23,416 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగం కల్పిస్తే పరోక్షంగా మరో 23 వేల మందికిపైగా ఉపాధి లభించనుంది.