న్యూశాయంపేట, ఆగస్టు 18: సీఎం కేసీఆరే తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్‌లో వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ను మరోసారి అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అరూరి రమేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు గిఫ్ట్‌గా ఇవ్వాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారదర్శకంగా పథకాలను అమలు చేస్తున్నామని, అర్హలందరికీ దళితబందు, గృహలక్ష్మి వర్తింపజేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష అని, కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేసి మరోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి, ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. హనుమకొండ హంటర్‌రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్‌లో వర్ధన్నపేట నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం జరిగింది. ముందుగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి అరూరి రమేశ్‌ను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు గిఫ్ట్‌గా ఇవ్వాలని కోరారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తమదేనన్నారు. గ్రామాల్లో ప్రతిపక్షాలు చేస్తున్న చిల్లర రాజకీయాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
పేదలందరికీ సంక్షేమ ఫలాలు
సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ సర్కారు ముందుకెళ్తున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. దళితబంధు, గృహలక్ష్మి పథకాలు నిరంతరం కొనసాగుతాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ విడుతల వారీగా ఈ పథకాలు అందుతాయని భరోసా ఇచ్చారు. ప్రజలు ఆందోళనలో ఉన్నారని, వారికి అర్థమయ్యేలా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పథకాల అమలు తీరుపై వివరించాలని సూచించారు. నియోజకవర్గానికి కేటాయించిన యూనిట్లను మండలాలు, గ్రామాల జనాభా ప్రతిపాదికన అందేలా చర్యలు తీకుంటామన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధులు పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ఎవరూ అపోహలు, ఆందోళనలకు గురికావొద్దని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షురాలు లలితాయాదవ్, జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ గజ్జెల శ్రీరాములు, ఎంపీపీలు, జడ్పీటీసీ, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.