‘రాష్ట్రంలోని తండాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలోని 3,146 తండాలను జీపీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే సర్కారు ధ్యేయం. వంకర మాటల బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పాలి. త్వరలోనే ‘గిరిజన బంధు’ పథకాన్ని అమలు చేస్తాం’ అని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి సంగెం, గీసుగొండ మండలాల్లో పర్యటించారు.
పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బిక్కోజీనాయక్ తండాలో రోడ్డు, బ్రిడ్జి, కోనాయిమాకులలో బాల సదనం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 104 స్వయం సహాయక సంఘాలకు రూ. 7.71 కోట్ల లింకేజీ రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలబాలికల సంరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.
– సంగెం/గీసుగొండ, డిసెంబర్ 20
సంగెం/గీసుగొండ, డిసెంబర్ 20: గిరిజన తండాలు, గూడేలను అభివృద్ధి ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మంగళవారం ఐటీడీఏ ఏటూరునాగారం ఆధ్వర్యంలో సంగెం మండలం బిక్కోజీనాయక్ తండా నుంచి తండా వరకు రూ.2.68కోట్లతో చేపట్టే బీటీ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులకు బిక్కోజినాయక్ తండాలో, గీసుగొండ మండలం కోనాయిమాకుల క్రాస్ వద్ద మిషన్ వాత్సల్య పథకంలో రూ.87.45లక్షలతో చేపట్టే బాల సదనం భవన నిర్మాణ పనులకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
రూ.5లక్షల 42వేల ప్రభుత్వ గ్రాంట్ కలిపిన రూ.19.70లక్షలతో ట్రాక్టర్‌తోపాటు వ్యవసాయ పరికరాలను గీసుగొండ ప్రగతి మండల సమాఖ్యకు అందజేశారు. గీసుగొండ మండలంలోని 104 స్వయం సహాయక సంఘాలకు రూ.7కోట్ల 71లక్షల లింకేజీ రుణాల చెక్కులను పంపిణీ చేశారు. బిక్కోజీనాయక్ తండాలో డప్పుచప్పుళ్లు, డీజే పాటలతో మంత్రి, ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఇంటింటికి తిరుగుతూ గిరిజనుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తండాల అభివృద్ధి గురించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని 3,146 గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన సీఎం కేసీఆర్ గిరిజనుల ఆరాధ్యుడన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గురుకులాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గిరిజన కుటుంబ సంఘటన నుంచే కల్యాణలక్ష్మి పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని త్వరలో భూమిలేని గిరిజనుల కోసం గిరిజన బంధు పథకం వస్తుందని వెల్లడించారు. బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.10కోట్లు ఇచ్చామని, బ్రిడ్జి నిర్మాణానికి రూ.కోటీ 50లక్షలతోపాటు మరో రూ.12కోట్లు మంజూరు చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీకి గిరిజనులు అండగా నిలువాలని కోరారు.
చిల్లర రాజకీయాలు చేస్తున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు బీజేపీ నాయకులను తరిమికొట్టాలన్నారు. తెలంగాణ తరహా పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. మంత్రి, ఘనంగా సన్మానించారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. కోనాయిమాకుల గ్రామంలో మహిళా భవన నిర్మాణానికి సీడీఎఫ్ నుంచి రూ.10లక్షలు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ న్యూట్రీషియన్ ఫుడ్ పథకాన్ని బుధవారం నుంచి ఉమ్మడి జిల్లాలోని భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ టీచర్ల వేతనాలను తెలంగాణ ప్రభుత్వం మూడుసార్లు పెంచిందన్నారు.
తెలంగాణలోనే గుర్తింపు : జడ్పీచైర్‌పర్సన్
తెలంగాణ రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు సమాన న్యాయం జరుగుతున్నదని చైర్మన్ గండ్ర జ్యోతి అన్నారు. సీఎం కేసీఆర్ అంగన్వాడీ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇచ్చారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం వేతనాలు ఇస్తున్నదని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ గోపి, కలెక్టర్లు శ్రీవత్స కోట, అశ్విని తానాజీ వాక్డే, డీఆర్డీఓ ఎం.సంపత్‌రావు, ఐటీడీఏ ఈఈ హేమలత, ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ విద్యారాణి, ఎంపీటీసీలు, గుగ్లోతు వీరమ్మ, పద్మా శ్రీనివాస్, ఇన్చార్జ్ తహసీల్దార్ రాజేశ్వర్‌రావు,
ఎంపీడీఓ కొమురయ్య, పీఆర్ డీఈ జ్ఞానేశ్వర్, ఐటీడీఏ డీఈ రామ్‌రెడ్డి, ఏఈ పుల్లయ్య, వైస్ ఎంపీపీ బుక్కమల్లయ్య, సొసైటీ చైర్మన్ కుమారస్వామి, సపావట్ కిషన్‌నాయక్, రామునాయక్, ఉండీల రాజు, నర్సింహస్వామి, ఐసీడీఎస్ ఆర్జేడీ ఝూన్సీలక్ష్మి, ఈఈ నరేందర్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి శారద, చైల్డ్ వెల్ఫేర్ జిల్లా చైర్ పర్సన్ వసుధ, ఏపీడీ శ్రీనివాస్, ఎంపీపీ భీమగాని సౌజన్య, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సర్పంచ్ డోలి రాధాబాయి, ఎంపీటీసీ వీరరావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేందర్‌రెడ్డి, రమేశ్, తహసీల్దార్ విశ్వనారాయణ, ఏపీఎం సురేశ్ పాల్గొన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఏం ఇచ్చిందో చెప్పాలి : చల్లా
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిందో బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్పాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. నల్లధనం తీసుకువచ్చి పేదల ఖాతాల్లో రూ.15లక్షలు జమ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మోదీ ఎందుకు ఇవ్వలేదో ప్రజలు బీజేపీ నాయకులను ప్రశ్నించాలన్నారు. నోట్ల మార్పిడితో ప్రజలకు ఒరిగిందేంటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ బడా వ్యాపారులకు రూ.20లక్షల కోట్లు మాఫీ చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
ఉచితాలు బంద్ చేయాలనే మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో ఉన్న పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. వ్యవసాయ మోటర్లకు కరెంట్ మీటర్లు పెట్టాలని సీఎం కేసీఆర్‌పై మోదీ తెస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో పెట్టేదిలేదని సీఎం చెబుతున్నారని, దీన్ని ప్రజలు గమనించాలని కోరారు.