Horoscope | 14-02-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
కొత్త వ్యక్తుల పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ప్రారంభించిన పనులు సమయానికి పూర్తవుతాయి. బంధువర్గం రాకతో ఖర్చులున్నా సంతృప్తిగా ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులు, కుటుంబపెద్దల సహకారంతో పనులు సాగుతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. సమయస్ఫూర్తితో మెలగుతారు. మంచి నిర్ణయాలు ఆచరణలో పెడతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. విద్యార్థులు చదువులలో రాణిస్తారు. ఉత్తమ ఫలితాలతో మంచిస్థాయిలో నిలుస్తారు. వ్యాపారస్తులకు గతంలో కంటే అనుకూలమైన సమయం. కలిసి వస్తుంది. పెట్టుబడులకు, విస్తరణకు అనుకూలమైన వారం.
వృషభం
ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. పనిలో ఒత్తిడి, భారం పెరుగుతాయి. స్నేహితులు, ఆత్మీయులతో పనులు పూర్తవుతాయి. చిన్నపాటి మనస్పర్ధలకు ఆస్కారం వుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ నియమాలకు లోబడి పనులు చేయడం అవసరం. ఉత్సాహంతో ఉంటారు. సంతృప్తిగా పనులు చేస్తారు. నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవడంతో పనులు చకచకా పూర్తవుతాయి. అనుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయాలతో పనులు కలిసి వచ్చినా, కొంత జాగ్రత్త అవసరం. మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటివారి సహకారం, పై అధికారుల ఆదరణ లభిస్తాయి. సంతోషంతో పనులు చేస్తారు. ప్రయాణాలలో వృథా ఖర్చులు, అలసట ఉండవచ్చు.
మిథునం
ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. తోటి ఉద్యోగులతో సంతృప్తిగా ఉంటారు. ఉన్నతాధికారుల సహకారానికి తగిన ప్రయత్నం అవసరం. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్య నియమాలను పాటిస్తారు. స్నేహితులు, బంధువర్గంతో ఖర్చులు ఉంటాయి. ఆలోచనలను అమలు చేస్తారు. ఆలస్యంగా తీసుకునే నిర్ణయాలవల్ల కొంత నష్టం వాటిల్లవచ్చు. విద్యార్థులు ఏకాగ్రతతో, పట్టుదలతో చదవాలి. అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభకార్యాల నిర్వహణకు పెద్దల సహాయ సహకారాలు అవసరమవుతాయి. వృథా ఖర్చుల మూలంగా సర్దుబాట్లు చేయవలసి రావచ్చు. పెద్దవారి సలహాలను విశ్వాసంలోకి తీసుకొని పనులు చేయడం అవసరం. ఇంట్లో భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు.
కర్కాటకం
గత పరిస్థితి నుండి బయట పడతారు. సంతృప్తిగా ఉంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో మంచి వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా పనులు తొందరగా పూర్తవుతాయి. బంధువర్గం సహకారం బాగా లభిస్తుంది. భూములు, వ్యవసాయం, గృహనిర్మాణ పనులు కలిసి వస్తాయి. కొంత ఆలస్యమైనా లాభదాయకంగా పనులు పూర్తి చేస్తారు. భక్తి భావనలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తిరీత్యా రావలసిన డబ్బు చేతికి అందుతుంది. క్రయ విక్రయాలవల్ల ఆదాయం పెరుగుతుంది.
సింహం
మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. వాటిని ఆచరణలో పెట్టి అనుకూల ఫలితాలు పొందుతారు. ప్రారంభించిన పనులు సరైన సమయంలో పూర్తవుతాయి. వివాదాల జోలికి వెళ్లకుండా మనస్ఫూర్తిగా పనులు చేస్తారు. కొన్ని విషయాలలో మనస్పర్ధలు రావచ్చు. పరిష్కరించుకుంటారు. బంధువర్గంతో, స్నేహితులతో పనులు పూర్తవుతాయి. మనసు నిలిపి పనులు చేస్తారు. పనులను చాకచక్యంతో, పట్టుదలతో పూర్తి చేస్తారు. భక్తి భావనలు పెరుగుతాయి. తల్లిదండ్రులు, పెద్దల సహకారం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఉద్యోగంలో స్థిరత్వం కోసం ఆలోచించాలి.
కన్య
ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. స్నేహితులు, బంధువర్గం ఇంటికి రావడంతో సంతృప్తిగా ఉంటుంది. వారి సహకారం లభిస్తుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. తోటి ఉద్యోగులతో, పై అధికారులతో పూజ్యభావంతో ఉంటారు. పనులను విశ్లేషించి చేయడంతో మంచి ఫలితాలు పొందుతారు. నిర్మాణం, భూములు, వాహనాల విషయాల్లో కలిసి వస్తుంది. కొన్ని విషయాలలో ఆర్థిక సమస్యవల్ల ఆలస్యం జరుగవచ్చు. సమాజం, కుటుంబంలోని పెద్దల సహకారం లభిస్తుంది. అందరితోనూ సరదాగా ఉంటూ, సంతృప్తిగా గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు చేస్తారు. విద్యార్థులకు మంచి సమయం. సత్ఫలితాలతో ముందుకు వెళతారు.
తుల
పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. ఆదాయం పెరిగినా దానికి సరిపడా ఖర్చులుకూడా ఒక పక్కన పెరిగే అవకాశం. స్నేహితులు, బంధువర్గంతో పనులు పూర్తవుతాయి. రావలసిన డబ్బు వివాదాలతో చేతికి అందుతుంది. పనులు పూర్తవడంలో జాప్యం. అతి కష్టం మీద కొన్ని పనులు పూర్తి కావచ్చు. స్నేహభావం పెంపొందించుకోవడంలో పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృథా ఖర్చులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. వస్త్ర, వస్తువులను కొంటారు. వాహనాల విషయంలో ఖర్చులు ఉండవచ్చు. భూములు, ఆస్తుల తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. వివాదాల్లోకి వెళ్లకుండా ఉండటం అవసరం.
వృశ్చికం
బంధుమిత్రుల రాకతో సంతోషంగా ఉంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు కూడా పెరగవచ్చు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగానే ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి పెద్దల సహకారం తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో పై అధికారుల ఆదరణ లభిస్తుంది. చిన్నచిన్న వివాదాలు రావచ్చు. ఆస్తుల తగాదాలు పరిష్కారమవుతాయి. సాంస్కృతిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వ్యక్తులకు కొత్త అవకాశాలు రావడం సంతృప్తినిస్తుంది. కొత్త పెట్టుబడులకు అనుకూలమైన వారం. కొంత జాగ్రత్తతో పనులు చేస్తూ వెళ్లాలి.
ధనుస్సు
ఇతరులపై ఆధారపడకుండా స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటూ పనులు పూర్తి చేసుకుంటారు. గురుభక్తి పెరుగుతుంది. పరిస్థితులకు అనుగుణంగా కార్యాలు చేస్తారు. పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబంలో అందరితోనూ ప్రేమభావంతో ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం. స్నేహితులు, బంధువర్గంతో సత్సంబంధాలు ఉంటాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. వృథా ఖర్చులు ఉండవచ్చు. చేబదులు, సర్దుబాట్లు అవసరం కావచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల ఆదరణ, తోటి ఉద్యోగులతో స్నేహభావం పెంపొందుతుంది.
మకరం
అందరితోనూ బాంధవ్యాలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆటంకాలు ఎదురు కావచ్చు. ఆర్థిక పరిస్థితివల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ఆఫీసులో తోటి ఉద్యోగుల సహాయం సంతృప్తినిస్తుంది. వివాదాలను నేర్పుతో పరిష్కరించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక అవకాశం లభిస్తుంది. మనస్పర్ధలు ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. వాహనాలవల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆదాయంలో స్థిరత్వం ఉన్నా అనవసర ఖర్చులవల్ల ఇబ్బంది పడతారు.
కుంభం
ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. పనులలో అభివృద్ధి. నలుగురికి సహాయపడే కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. బంధువుల రాకపోకలు జరుగవచ్చు. నూతన పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. నిర్మాణ రంగం, వ్యాపారాలలో అప్రమత్తత అవసరం. వ్యాపారస్తులు ఒప్పందాలలో కొంత జాగ్రత్త పడటం అవసరం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగానే ఉంటాయి. నిలిచి పోయిన పనులలో కదలిక వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు పెద్దల సహకారంతో ముందుకు సాగుతాయి. డబ్బు ఆలస్యంగా అందుతుంది.
మీనం
వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పనివారితో ఆనుకూలత. చేతిలో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త పనుల ప్రారంభంపై మనసు నిలుపుతారు. వ్యాపార విస్తరణకు ఒప్పందాలు చేసుకుంటారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులకు అనుకూలమైన వారం. అన్నదమ్ములు, బంధువర్గంతో వున్న గత భేదాభిప్రాయాలు తొలగుతాయి. అన్ని విధాలుగా సహకారం లభిస్తుంది. పనులు కలిసి వస్తాయి. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారమవుతాయి. స్థిర, చరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

