Municipal Elections | హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ)/నమస్తే నెటవర్క్: రాష్ట్రంలో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ అధికార పార్టీ కాంగ్రెస్ అరాచకాలకు దిగింది. కొన్ని ప్రాంతాల్లో అధికార ఒత్తిడికి పోలీస్ యంత్రాంగం కూడా సహకరించింది. ఒకానొక దశలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడంలో పోలీసు వాహనాలే వినియోగించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కాంగ్రెస్ నేతల ఆదేశాల మేరకు బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఇక పోలీసుల అండ చూసుకొని కాంగ్రెస్ కార్యర్తలు మరింత రెచ్చిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయిన చోట దాడులకు తెగబడ్డారు. కౌంటింగ్ సెంటర్ల వద్దే బీఆర్ఎస్ కార్యకర్తల నెత్తురు కండ్లజూశారు. ఇంత జరుగుతున్నా అరాచకవాదులను కట్టడిచేయడంలో
పోలీసులు విఫలమయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 31వ వార్డులో విజయం సాధించిన బీఆర్ఎస్ అ భ్యర్థి పాశికంటి రమ్య ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడికి దిగారు.

అడ్డువచ్చిన వారిని కర్రలతో గాయపరిచారు. బీఆర్ఎస్ సీనియర్ నా యకుడు బింగి ఇజ్జగిరిని తీవ్రంగా కొట్టారు. నా ఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు అక్కడికి చేరుకొని బాధితులను పరామర్శించారు.
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో గెలుపొందిన బీఆర్ఎస్ రెబల్, స్వతంత్ర అభ్యర్థి ముడావత్ హన్మంతును తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా, బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. చివరకు పోలింగ్ కేంద్రం నుంచి హన్మంతును పోలీసులు వేరే ప్రాంతానికి తరలించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు.

పరిగి మున్సిపాలిటీలో 18 వార్డులకుగాను బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో ఎనిమిది వార్డుల్లో గెలిచాయి. 1, 3 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ మీదిగడ్డ శ్రీనివాస్ పోలీసు అధికారుల కాళ్లు మొక్కారు. హన్మంతును బయటకు తీసుకురావాలని కోరగా, పోలీసులు నాలుగు వాహనాలను పెట్టి హన్మంతును తీసుకువెళ్లడం గమనార్హం. పోలీసులు అధికార పార్టీకి వంత పాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మీర్ మహమూద్‌అలీ, భాస్కర్, రవికుమార్, నరేశ్ మండిపడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ పాల్వంచ, ఫిబ్రవరి 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు తెరలేపింది. 32వ డివిజన్లో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి గుగులోత్ రాంబాబు ను కాంగ్రెస్ నాయకులు శుక్రవారం కిడ్నాప్ చేశారు. రాంబాబు భార్య, కుటుంబసభ్యులతో కలిసి అతడి ఇంటివద్ద మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు నిరసన వ్యక్తంచేశా రు. పోలీసులతో బెదిరించి తీసుకువెళ్లడం ఎంతవరకు సమంజసమని వనమా ప్రశ్నించారు. రాంబాబు భార్య మాట్లాడుతూ.. తన భర్తను కాంగ్రెస్ నాయకులు విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.
గుగులోత్ రాంబాబును కాంగ్రెస్ నాయకు లు ఎత్తుకెళ్లడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా మేయర్ పీఠాన్ని దకించుకోవాలని కాంగ్రెస్ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని దు య్యబట్టారు. ఎన్నికల్లో గెలిచే సత్తాలేక ఇతర పార్టీ అభ్యర్థుల కిడ్నాప్‌నకు పాల్పడటం అనైతికమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతకాలం ఇలాంటి అరాచకాలు చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు అనైతికంగా పనిచేస్తే భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో 5వవార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి నూనావత్ శిభారాణి గెలుపొందారు. అంతుకుముందే గురువారం రాత్రి శిభారాణిని ఎ మ్మెల్యే కేఆర్ నాగరాజు అనుచరులు క్యాంపునకు తరలించారు.

శుక్రవారం శిభారాణి విజయం సాధించిందని తెలుసుకొని ఆమె భర్త రాజేందర్‌ను కూడా క్యాంపునకు తరలించేందుకు యత్నించారు. దీంతో డీసీ తండాకు చెందిన గిరిజనులు క్యాంపు కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఆ తర్వాత జా తీయ రహదారిపై బైఠాయించారు. కొందరు యువకులు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 2వ వార్డు నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి మమత భర్తపై కాంగ్రెస్ శ్రేణులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి వినోద్‌ను అధికారపార్టీ నేతలు ఆటోలో ఎత్తుకెళ్లారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను లాక్కెళ్లేందుకు కాంగ్రెస్ కౌన్సిలర్లు తీవ్రంగా ప్రయత్నించారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ జడ్పీహెచ్ స్కూల్‌ని కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ రెబెల్‌గా గెలిచిన ఇద్దరు అభ్యర్థులను తరలించే యత్నం చేశారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి వారు ప్రతిఘటించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
జనగామ మున్సిపాలిటీలో గెలిచిన స్వ తంత్ర అభ్యర్థిని కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. దీన్ని బీఆర్ఎస్ అడ్డుకోవడంతో భువనగిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనగామలో నలుగురు స్వతంత్రులు గెలవగా, అందులో ఓ అభ్యర్థి బీఆర్ఎస్కు మద్దతు తెలిపేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కాంగ్రెస్ ఒత్తిడితో అభ్యర్థి బస్సులో హైదరాబాద్ బయల్దేరాడు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, నాయ కులు శివారులో బస్సును ఆపి సదరు అభ్యర్థిని తీసుకెళ్లారు.

ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐల య్య కూడా అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మ హేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ భువనగిరి పార్లమెం ట్ ఇన్చార్జ్ క్యామ మల్లేశ్ స్వతంత్ర అభ్యర్థిని ఉంచిన హోటల్ వద్దకు చేరుకున్నారు. ఈ క్ర మంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యాదాద్రి ఎస్పీ అక్షాంశ్యాదవ్తో ఎమ్మెల్యే పల్లా ఫోన్లో మాట్లాడారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అభ్యర్థి ఎమ్మెల్యే పల్లాతో వస్తానని చెప్పారు. దీంతో అభ్యర్థిని ఎమ్మెల్యే పల్లా తన వాహనంలో తీసుకొని వెళ్లారు.
జమ్మికుంట మున్సిపల్లో 30 వార్డులకు బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, బీజేపీ 4, స్వ తంత్రులు 3, ఏఐఎఫ్బీ 1 గెలిచాయి. ఫలితా లు వెలువడిన వెంటనే తమ అభ్యర్థులను త రలిస్తామని కేంద్రం వద్దకు వాహనాలను తీ సుకొచ్చారు. కానీ, ఇండిపెండెంట్లు, ఏఐఎఫ్బీ అభ్యర్థులను కిడ్నాప్ చేశారు.

బీఆర్ఎస్ అభ్యర్థులు చుంచు రమాదేవి, మంద రాధతో పాటు పలువురిని తీసుకెళ్లేందుకు యత్నించా రు. దీన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణు లు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో దాడులు చేసుకున్నారు. చివరకు బీఆర్ఎస్ నేతలు త మ అభ్యర్థులను క్యాంపునకు తరలించారు.