మడికొండ, అక్టోబర్ 24 : గ్రేటర్ 44వ డివిజన్ భట్టుపల్లి శివారులోని ఎస్ఆర్ కళాశాల మైదానంలో ఈ నెల 27న నిర్వహించనున్న వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో సభా వేదిక, హెలిప్యాడ్, పారింగ్ తదితర విషయాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంతరాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సభా స్థలిలో చేపడుతున్న పనుల గురించి ఎమ్మెల్యే అరూరి మంత్రికి వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పర్వతగిరి : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగ నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పర్వతగిరి మండల కేంద్రంలో సోమవారం దసరా వేడుకలు కనుల పండువగా జరిగాయి. కార్యక్రమలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం రావణవధ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ దసరా వేడుకలను జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పండుగను స్ఫూర్తిగా తీసుకుని విజయం సాధించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, పర్వతగిరి సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు, ఎం పీటీసీలు మాడుగుల రాజు, బొట్ల మ హేంద్ర, బీఆర్ఎస్ నాయకులు సోమేశ్వర్రావు, బొట్ల శ్రీకాంత్, చిన్నపెల్లి అజ య్ పాల్గొన్నారు. అలాగే, మండలంలోని అన్నారం, ఏనుగల్లు గ్రామాల్లో కూడా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కొంకపాకలో దుర్గా మాతా విగ్రహం వద్ద ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మద్దెల రాజు నేతృత్వంలో అర్చకుడు సత్యనారాయణ శర్మ ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్యక్రమంలో ప్రశాంత్, రామ్‌చందర్, రాజు పాల్గొన్నారు.
పర్వతగిరి, అక్టోబర్ 24 : హైదరాబాద్‌లో స్థిరపడిన పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన పలువురు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మద్దతు తెలిపారు. దసరా వేడుకల కోసం గ్రామానికి వచ్చిన వీరంతా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆయన స్వగ్రామం పర్వతగిరికి మంగళవారం ప్రత్యేకంగా వచ్చి కలిశారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి చేసి చూపించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకే తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధికి వారంతా ఫిదా అయ్యారు. మంత్రిని కలిసిన వారిలో ఆరెగూడేనికి చెందిన ఇటిక్యాల సుమన్, కడుదుల వెంకటేశ్, సురవు ప్రవీణ్, ఎంగిలి అనిల్, వరికాల రామకృష్ణ, ఇటిక్యాల హరీశ్, గుల్లపెల్లి ప్రసాద్, తుమ్మరపెల్లి రంజిత్, పెండ్లి సుధాకర్, గాజులపాటి నర్మద, తోట సుదర్శన్, కడుదుల సురేశ్ ఉన్నారు.