కాంగ్రెస్.. కరోనా కంటే డేంజర్
కాంగ్రెస్ పార్టీ కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని, దాన్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వొద్దని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలోని 9, 10, 11, 12, 21, 20, 23, 24 వార్డులో గురువారం ఆయన పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు.
- వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలట?
- పదేళ్లుగా 24 గంటల విద్యుత్ అందిస్తున్న సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట, నవంబర్ 23: కాంగ్రెస్ పార్టీ కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని, దాన్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వొద్దని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలోని 9, 10, 11, 12, 21, 20, 23, 24 వార్డులో గురువారం ఆయన పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. కరోనాను మందుతో పారదోలామని, డేంజర్ అయిన కాంగ్రెస్‌ను దరిచేరనివ్వొద్దని పెద్ది కోరారు. కాంగ్రెస్ స్కాముల పార్టీ అని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే మళ్లీ తెలంగాణలో చిమ్మచీకట్లు అలుముకుంటాయన్నారు. కాంగ్రెస్ నేతలు వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలంటున్నారని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుబంధు కూడా ఇవ్వమని ఇప్పుడే చెబుతున్నారని, తెలంగాణలో పదేళ్లుగా 24 గంటల కరెంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
హస్తం పార్టీకే గ్యారెంటీ లేదని, ఇక పథకాల హామీలను ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ప్రజలు అర్థం చేసుకుని అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని కోరారు. నర్సంపేటలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి మాదన్నపేట ట్యాంక్‌బండ్‌ను ఏర్పాటు చేయాడానికి నిధులు తెస్తే పనులు అసంపూర్తిగా మధ్యలేనే వదిలేశాడని విమర్శించారు. నర్సంపేటలో జిల్లా ఆస్పత్రి పూర్తి అయిన తర్వాత 14 వందల ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను నర్సంపేట ప్రాంతంలోని వారితోనే నింపుతానని హామీ ఇచ్చారు. నర్సంపేటలో అభివృద్ధి పనులు చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దగ్గర వారే కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చి పనులు ఆపించారని తెలిపారు. కార్యక్రమాల్లో రాయిడి రవీందర్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, బండి రమేశ్, బండి సందీప్, కౌన్సిలర్లు రాయిడి కీర్తీ దుష్యంత్‌రెడ్డి, నాగిశెట్టి పద్మా ప్రసాద్, గంప సునీతా రఘునాథ్, పాషా, దార్ల రమాదేవి, బండి ప్రవీణ్, బానాల ఇందిర పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం
నర్సంపేటరూరల్: బీఆర్ఎస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురిజాలలో కాంగ్రెస్, టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కత్తి మల్లయ్య, కందుల వెంకటేశ్వర్లు, కోండ్ర సాంబశివుడు, పొదిల సాంబయ్య, డ్యాక రవితోపాటు మరికొంత మంది మందికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, సర్పంచ్ గొడిశాల మమత-సదానందంగౌడ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అల్లి రవి, పత్రి కుమారస్వామి, అన్న రాజమల్లు, రాజ్‌కుమార్, రవి, రాజు పాల్గొన్నారు.
అభివృద్ధి చేశా… ఆశీర్వదించండి
నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మళ్లీ తనను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. గురువారం సాయంత్రం లక్నేపల్లిలోని బాలాజీ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యావంతుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పెద్ది మాట్లాడుతూ తాను డెవలప్మెంట్ విజన్ ఉన్న నాయకుడనని, మేధావులు ఆశీర్వదించాలని కోరారు. నర్సంపేటను విద్యా, వైద్య రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు. మేధావులు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 450 పడకల ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మరో మూడు నెలల్లో వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు. కార్యక్రమంలో బిట్స్ చైర్మన్ డాక్టర్ ఎ.రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ వనజ, వివిధ కళాశాలల చైర్మన్లు గోగుల ప్రభాకర్‌రెడ్డి, జీజుల సాగర్, ప్రిన్సిపాళ్లు డాక్టర్ వీఎస్ హరిహరన్, మోర్తాల రాంరాజ్, బిట్స్ సెక్రటరీ డాక్టర్ జి.రాజేశ్వర్‌రెడ్డి, ఏవో సలేంద్ర సురేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

