పరకాల, డిసెంబర్ 8 : దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అని, ఇక రానున్న రోజుల్లో దేశ్‌కి నేత సీఎం కేసీఆర్ కావడం ఖాయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తొలిసారిగా గురువారం బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని భారత రాష్ట్ర సమితిగా ఆమోదం పొందిన తరుణంలో నియోజకవర్గ విపక్ష పార్టీలకు చెందిన శ్రే ణులు బీఆర్ఎస్లో చేరడం శుభసూచికమన్నారు.రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి దేశానికే మార్గదర్శకమని, కేసీఆర్ పాలనలో రాష్ర్టంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.
కేసీఆర్ పాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని, పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం కల్పించనున్నట్లు చెప్పారు. కాగా, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందిన సీఎం కేసీఆర్‌ను దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారి లో గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు మద్దూరి సుమలత, తుత్తురు చిరంజీవి, గుమ్మడి రమేశ్, నాంపల్లి రవీందర్, మద్దూరి చంద్రమల్లు, తోట రవీందర్, గోనెల సాయి పవన్‌తో పాటు 30మంది ఉన్నారు. కార్యక్రమంలో మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.