శాయంపేట మార్చి 13 : శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని దేవాదుల పంప్ హౌస్(Devadula Pump House నుంచి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ధర్మసాగర్‌కు నీటి లిఫ్టింగ్‌ను బంద్ చేయించా మని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. శాయంపేటలో బుధవారం నాయ కులతో కలిసి బుచ్చిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలివాగు ఆయకట్టు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాలతో ధర్మసాగర్ కు పంప్ హౌస్ నుంచి నీటి లిఫ్టింగ్ నిలిపి వేయించామని తెలిపారు. చలివాగు బ్యాక్ వాటర్ పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. చలివాగు కాలువ మరమ్మతులు జరుగుతున్న తరుణంలో క్రాప్ హాలిడే ప్రకటించినప్పటికీ రైతుల విజ్ఞప్తి మేరకు జాలు కాలువ ద్వారా నీటిని విడుదల చేశామని పేర్కొన్నారు. రైతుల పంటలకు భరోసా ఇస్తున్నామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
చలివాగు పంప్ హౌస్ నుంచి ధర్మసాగర్ కు పంపింగ్ బంద్ చేసిన విషయాన్ని రైతులు గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చిందం రవి, వలి హైదర్, దుబాసి కృష్ణమూర్తి, వైద్యుల వెంకట రాజా రెడ్డి, ఆదిరెడ్డి, లడే రాజ్ కుమార్, ఐలయ్య, గట్టయ్య, మార్కండేయ, డీటీ రెడ్డి, బాసని రవి, సదయ్య, జక్కుల నరేష్ ,రాజు, జగన్ రాజయ్య ,రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.