ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు.. నేడు కన్నెపల్లికి రామన్న
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లికి ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్‌ను పరిశీలించనున్నారు.
- పంప్‌హౌస్, గోదావరి జలాల పరిశీలించనున్న కేటీఆర్
- అనంతరం మీడియాతో మాట్లాడనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
- హాజరుకానున్న ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల పార్టీ శ్రేణులు
జయశంకర్ భూపాలపల్లి, జూలై 4, (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లికి ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్‌ను పరిశీలించనున్నారు. మేడిగడ్డ బరాజ్‌తో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశమున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును కేటీఆర్ ఎండగట్టనున్నారు.
వరంగల్, కరీంనగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు ఆయన వెంట రానున్నారు. ఈ మేరకు శనివారం భూపాలపల్లి, మంథని మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పుట్ట మధు వివరాలు వెల్లడించారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న కేటీఆర్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కన్నెపల్లికి చేరుకొని పంప్‌హౌస్‌తో పాటు వృథాగా సముద్రంలో కలుస్తున్న వేలాది క్యూసెక్కుల గోదావరి జలాలను పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం 2 నుంచి 3 గంటల మధ్య మీడియా సమావేశంలో పాల్గొంటారని గండ్ర, పుట్ట మధు పేర్కొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

