పాలకుర్తి/ కృష్ణకాలనీ, జనవరి 1 : ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, శ్రేణులతో కలిసి న్యూ ఇయర్ కేక్ కట్ చేయడంతో పాటు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నుంచి శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన కుమారుడు గౌతమ్‌రెడ్డి, రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి తదితరులు కేటీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.