దేవరుప్పుల/పాలకుర్తి/పెద్దవంగర/తొర్రూరు, నవంబర్ 28 : ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై స్థానిక కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. దేవరుప్పుల, పాలకుర్తి, తొర్రూరులో కా ర్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మా ట్లాడారు. ఏ ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ సర్కారుపై బదలా తీసుకునేందుకు సర్పంచ్ ఎన్నికలు వేదిక కానున్నాయని అన్నారు. గెలుపు గుర్రాలనే సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలపాలని సూచించారు. మెజారిటీ గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరచిన సర్పంచ్‌లు గెలవడం ఖాయమన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని అన్నారు. రైతుల కష్టాలు తీర్చడంలో సర్కారు విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి బీసీలను మోసం చేశారని మండిపడ్డారు. బీసీలంతా కాంగ్రెస్‌ను ఓడించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, చీరెల పంపిణీ నాటకమన్నారు.
పెద్దవంగరలో కాంగ్రెస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, యూత్ నాయకులు బీఆర్ఎస్లో చేరగా, ఎర్రబెల్లి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అదేవిధంగా అమ్మాపురం నుంచి ముద్దం సునీత, హరి పి రాలకు చెంచర్ల స్వాతి, నాంచారిమడూరుకు మంద మల్లేశ్, పెద్దమంగ్య తండాకు జాటోత్ రమే శ్, వెంకటాపురానికి ధరావత్ సునీత, వెలికట్టేకు బందు శ్రీనివాస్, జమస్తాన్పురానికి కంచపల్లి స్వాతి, అమర్‌సింగ్ తండాకు భూక్యా శిరీష, దుబ్బ తండాకు జాటోత్ వనజలను పార్టీ సర్పంచ్ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. అనంతరం చర్లపాలెంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరగా, దయాకర్ రావు పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు తీగల దయాక ర్, పసునూరి నవీన్, మాజీ అధ్యక్షుడు మల్లేశ్, వర్కిం గ్ ప్రెసిడెంట్ రాంసింగ్, మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీలు సోమయ్య, నాగిరెడ్డి, నాయకులు అశోక్‌కుమార్, పల్లా సుందర రాంరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, ఇప్ప పృథ్వీరెడ్డి, చింత రవి, భిక్షపతి, ఉప్పల్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, బస్వ వెంకన్న, జోగు సోమనర్స య్య, పాము మోహన్, మల్లికార్జున్, వంగ అర్జున్, మైదం జోగేశ్వర్, జలేంధర్‌రెడ్డి, ఇంటి మల్లారెడ్డి, సోమిరెడ్డి, హనుమంతు, ఎల్లయ్య, రాజన్న, బాలూనాయక్, రాంబాబు, వేణు, పాము శ్రీనివాస్, కల్వ ల భాస్కర్‌రెడ్డి, మహేందర్, కర్ణాకర్‌రెడ్డి, గుగ్గిళ్ల యా కయ్య, మాటూరి యాకయ్య, సోమేశ్వర్రావు, నాగ న్న, సురేశ్, వెంకట్‌నాయక్, సుధీర్‌కుమార్, సంజ య్, వెంకన్న, ఎన్నారై సునీల్‌రెడ్డి, దేవస్థాన మాజీ చైర్మన్ రామచంద్రయ్యశర్మ పాల్గొన్నారు.