స్టేషన్ ఘన్పూర్/జఫర్‌గఢ్, ఏప్రిల్ 17 : కాళేశ్వరం, సమ్మక-సారక బరాజ్‌తో పాటు అన్ని రిజర్వాయర్లు కట్టించింది కేసీఆరే అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలకు దీటుగా కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం అండగా నిలిచిందన్నారు. గురువారం స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్‌లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రజతోత్సవ మహాసభకు ఉమ్మడి వరంగల్ జిల్లా కంటే అధిక సంఖ్యలో హాజరవుతామని హామీ ఇచ్చిన కార్యకర్తలు మాట మీద నిలబడతారని అన్నారు. శ్రేణులకు అండగా ఉండి కాపాడుకుంటామన్నారు. కడియం శ్రీహరి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చింది మాట్లాడడం సరికాదని, ప్రతీ ది రికార్డు ఉంటుందన్నారు.
కాంగ్రెస్ సర్కారు 34 రోజులు మోటర్లు ఆన్ చేయకుండా రైతులకు సా గునీరు అందించకపోవడంతో 30 శాతం పంటలు ఎండిపోయాయని, రైతుల సమస్యలపై బీఆర్ఎస్ ధర్నా చేపడితేనే అప్పుడు సాగునీరు అందించారని పేర్కొన్నారు. 2014 నుంచి 2023 వరకు ఈ నియోజకవర్గంలో కడియం చేసిన అభివృద్ధిపై ఒక్క శిలాఫలకం చూపిస్తే ము క్కు నేలకు రాస్తానని పల్లా సవాల్ విసిరారు. నీ ఆంధ్రా అల్లుడు, బినామీ పేర్లతో ఉన్న భూముల వివరాలను బయటపెడతానన్నారు.
దేవునూరు లో 50 ఎకరాలు, ముప్పారంలో 25 ఎకరాల్లో రెం డు నెలల క్రితం బినామీలతో సాగు చేసిన వివరాలు, రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామంలో బినామీ భూములు, జఫర్‌గఢ్ మండలంలో కొత్తగా కట్టే స్కూల్ వద్ద కబ్జాకు యత్నిస్తున్న విషయాలను ఆధారాలతో చూపిస్తానన్నారు. కారు గుర్తుపై గెలిచిన కడియం శ్రీహరి తన ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేయాలని రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. వయస్సు పైబడిన కొద్దీ శ్రీహరి తనను, రాజయ్యను సంస్కారం మరిచి నీచ పదాలను వాడుతున్నాడని, మార్చుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని అన్నారు.
చలో ఎల్కతుర్తి మహాసభ వాల్ పోస్టర్‌ను పల్లా, రాజయ్య ఆవిష్కరించారు. అనంతరం జఫర్‌గఢ్ మండలంలోని ఆయా గ్రామాల నుంచి బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీకి చెందిన 15 మంది కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, జఫర్‌గఢ్ మండల ఇన్చార్జి పసునూరి మహేందర్, మా జీ జడ్పీటీసీ మారపాక రవి, ఆకుల కుమార్, ఇనుగాల నర్సింహారెడ్డి, చల్లా చందర్ రెడ్డి, అక్కనపల్లి బాలరాజు, కనకం గణేశ్, లకావత్ చిరంజీవి, తాటికొండ సురేశ్‌కుమార్, పొన్న రంజిత్, కుంభం కుమార్, అనుమాల మల్లేశం, బంగ్లా శ్రీను, మారపాక రవి, జయపాల్‌రెడ్డి, శంకర్, బుచ్చయ్య, సోమిరెడ్డి, కవిత, రాధిక, ఆయా గ్రామాల క్లస్టర్ ఇన్చార్జులు పాల్గొన్నారు.