ఎల్కతుర్తి, ఏప్రిల్ 13 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం యావత్ దేశం ఎదురుచూస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆదివా రం మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభా ప్రాంగణం, పార్కింగ్ తదితర విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ ఎలాంటి హింసకు తావులేకుండా రాజ్యాంగబద్ధంగా తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన తదనంతంరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ నిర్మాణాత్మక పాలన కొనసాగిస్తే.. 16 నెలలుగా రేవంత్‌రెడ్డి దుర్మార్గపు, రాక్షస పాలన నడుస్తున్నదని మండిపడ్డారు.
చైనాలోని గోబి ఎడారి తర్వాత పదేండ్ల కాలంలో కోట్లాది మొక్కలు నాటిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అయితే ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాతో ఇండ్లు కూల్చడమే కాకుండా హెచ్‌సీయూలో చెట్లను తొలగిస్తూ అరాచక పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో తాగు, సాగు నీటికి కొరత లేదని, అనేక రంగాల్లో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను అభివృద్ధి చేశారని, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి పాత సమస్యలను సృష్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలవి కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయాల్సిన బాధ్యత ప్రజల తరపున బీఆర్ఎస్కు ఉందని, హామీల అమలు కోసం ఈ సభ నాంది పలుకుతుందన్నారు. హామీలను విస్మరించి ఢిల్లీకి కప్పం కడుతున్న రేవంత్‌రెడ్డి సర్కారుకు ఈ సభ చెంపపెట్టులా మారుతుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక అవుతుందని అన్నారు. గతంలో ఏ సభైనా పరేడ్ గ్రౌండ్స్‌లో జరిపేవారని, ఇప్పుడు ఎల్కతుర్తిలో 1200 ఎకరాల్లో జరుగుతున్న సభ 25 పరేడ్ గ్రౌండ్స్‌తో సమానమని అభిప్రాయపడ్డారు.
4 కోట్ల ప్రజలున్న తెలంగాణలో నిర్వహిస్తున్న ఈ సభ చరిత్రాత్మకంగా నిలుస్తుందని, ఇలాంటి సభలు కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమని సిరికొండ పేర్కొన్నారు. ఆయన వెంట వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, మండల పార్టీ అధ్యక్షుడు పిట్టల మహేందర్, సొసైటీ వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, నాయకులు తంగెడ మహేందర్, తంగెడ నగేశ్, కడారి రాజు, గొల్లె మహేందర్, కొమ్మిడి మహిపాల్‌రెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, దుగ్యాని సమ్మయ్య, జూపాక జడ్సన్, ఎండీ మదార్, రాజేశ్వర్‌రావు, సాంబమూర్తి, కోరె రాజుకుమార్, చిట్టిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం
వొడితెల సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే
ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు వచ్చే పార్టీ శ్రేణులు, ప్రజల కోసం సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం. అన్ని ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు, కార్యకర్తల వాహనాల పార్కింగ్‌కు స్థలాలను ఇప్పటికే గుర్తించి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కేసీఆర్ ప్రసంగం వినేందుకు ఆసక్తి చూపుతున్నారు. కేసీఆర్ సార్‌ను చూసేందుకు ముం దుగానే వచ్చి ముందు వరుసలో ఉంటామ ని ప్రజలు చెబుతున్నారు. కేసీఆర్ మాట, సందేశం వినేందుకు సకల జనులు ఎదురుచూస్తున్నారు. తప్పక ఈ సభ చరిత్రలో నిలిచిపోతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజల కోసం వలంటీర్లను నియమించి సకల సదుపాయాలు కల్పిస్తున్నాం.
సభను విజయవంతం చేయాలి
టేకుమట్ల, ఏప్రిల్ 13 : హనుమకొండ జిల్లా ఎలతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం పరకాలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం నుంచి అధిక సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు సభకు తరలి వచ్చేలా చూడాలన్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు తెలియజేస్తూ, కేసీఆర్ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ సభకు జనాలను తరలించాలన్నారు. సమావే శంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవి గౌడ్, మా జీ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, ఆకునూరి తిరుపతి, మాజీ ఎంపీ పీ బందెల నరేశ్, ఆది రఘు పింగిళి వెంకటేశ్వర్‌రెడ్డి, పోతనవెన ఐలయ్య, బొడ్డు సదానందం, ఉద్దమారి మహేశ్, కొ లిపాక రాజయ్య, బిలకండి ఉపేందర్‌రావు, చదువు మహేందర్‌రెడ్డి, నల్లబెల్లి రవీందర్, పొన్నం చంద్రయ్య, కోఆప్షన్ సభ్యులు మహ్మద్ అఫ్జల్, చేరికు రాజిరెడ్డి, ప్రభాకర్‌రావు, దొడ్ల కోటి, జీ లక్ష్మణ్, డీ రవి, ఉపసర్పంచ్ చంద్రగిరి సం పత్, చెలకని శంకర్, అక్రమ్, ఎం రాజు పాల్గొన్నారు.