మహబూబాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 27న ఎలతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను సక్సెస్ చేద్దామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కవిత నివాసంలో డోర్నకల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం మాజీ మంత్రి రెడ్యానాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ఇంత త్వరగా ఊహించలేనంత వ్యతిరేకత వస్తుందని అనుకోలేదన్నారు.
రేవంత్‌రెడ్డి మహిళలకు ఇస్తామన్న రూ. 2500, రైతు బంధు రూ. 15,000, ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం, తదితర పథకాలు ఇప్పుడు ఎటుపోయాయ్ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా రేవంత్ రెడ్డి తీరులో మార్పు రాకపోవడం శోచనీయమన్నారు. తానంచర్లలో స్థానిక ఎమ్మెల్యేను రైతుబంధు రాలేదని ఓ రైతు అడిగితే మా దగ్గర పైసల్ లేవని చెప్పి చేతులు దులుపుకోవడం సిగ్గు చేటన్నారు.
ఒక చెరువులో కూడా నీళ్లు నింపే ప్రయత్నం చేయలేని స్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉందని, ఎండుతున్న పొలాలు చూస్తుంటే ప్రాణం తరుకుపోతుందన్నారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని, ప్రజలకు అండగా కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, యువ నాయకులు డీఎస్ రవిచంద్ర, నూకల వెంకటేశ్వర రెడ్డి, భిక్షంరెడ్డి, దేవేందర్, విద్యాసాగర్, వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు డోర్నకల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చి సంపూర్ణ మద్దతు తెలపాలి. నియోజకవర్గానికి ఇచ్చిన టార్గెట్ కనుగుణంగా గ్రామగ్రామాన ప్రణాళిక రూపొందించుకొని ముందస్తుగా సభకు చేరుకోవాలి.
– కవిత, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు డోర్నకల్ నియోజకవర్గం నుంచి సుమారుగా 20 వేల మంది తరలిరావాలి. గ్రామ పార్టీ అధ్యక్షులు ఆ రోజున ఉదయం బీఆర్ఎస్ జెండాను ఎగురవేసిన అనంతరం సభకు బయలుదేరాలి. నియోజక వర్గంలోని ఏడు మండలాల పరిధిలో ప్రతి గ్రామం నుంచి భారీగా కార్యకర్తలను తీసుకురావాలి.
-రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే
ఎల్కతుర్తి, ఏప్రిల్ 4: బీఆర్ఎస్ పార్టీ 25 వసంతా లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎల్కతుర్తిలో పార్టీ మండల నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సభను ఎల్కతుర్తిలో నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించడం మనందరి అదృష్టమన్నారు.
మనకు దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సభ విజయవంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరా రు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి మెజార్టీ ప్రజ లు తరలివచ్చేలా చూడాలని చెప్పారు. యువత ముం దుకొచ్చి వలంటీర్లుగా పనిచేసి రాష్ట్రంలోని వివిధ ప్రాం తాల నుంచి వచ్చే పార్టీ నాయకులు, కార్యకర్తలకు సేవలందించాలని విజ్ఞప్తి చేశారు. సభ కోసం వచ్చే వాహనాల పార్కింగ్ కో సం స్థలాలు గుర్తించినట్లు ఆయన తెలిపా రు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఇప్పుడు 25 వసంతాలు పూర్తి చేసుకున్నామని, భారీ బహిరంగ సభలకు పెట్టింది పేరు బీఆర్ఎస్ అని చెప్పారు.
అంతకుముందు సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను ఆయన ద్విచక్ర వాహనంపై వెళ్లి పరిశీలించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్‌గౌడ్, వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, నాయకులు తంగెడ మహేందర్, ఎల్తూరి స్వామి, గొల్లె మహేందర్, తంగెడ నగేశ్, కడారి రాజు, పోరెడ్డి రవీందర్‌రెడ్డి, గొడిశాల వినయ్, కొమ్మిడి మహిపాల్‌రెడ్డి, దేవేందర్‌రావు, ఏ రాజు, వెంకటేశ్ యాదవ్, సాంబమూర్తి, సీ నగేశ్, దుగ్యాని సమ్మయ్య, వేముల శ్రీనివాస్, గుండేటి సతీశ్, జూపాక జడ్సన్, ఈర కమలాకర్, చెవుల కొమురయ్య, ఎస్ శంకర్, యాళ్ల మోహన్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, కే నవీన్, మదార్, విక్రంగౌడ్, శ్రీకాంత్‌యాదవ్, చిట్టిగౌడ్, కే ప్రవీణ్, ఉట్కూరి కార్తీక్, భగవాన్, రంజిత్, కృష్ణవేణి, భాగ్య పాల్గొన్నారు.
-మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్