చిట్యాల, ఏప్రిల్ 11: కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు మండలంలోని నవాబుపేట, ఏలేటిరామయ్యపల్లి, చింతకుంటరామయ్యపల్లి, కైలాపూర్, తిరుమలాపూర్, గుంటూరుపల్లి, చిట్యాల గ్రామాల్లోని కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి సకల జనులను చైతన్యం చేసి చావు దాకా వెళ్లి స్వరాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు.
పదేండ్ల పాలనలో తాగు, సాగు నీరు, రోడ్లు, తండాలను గ్రామ పంచాయతీలు చేయడం, ప్రజలు అడగని ఎన్నో పథకాలను తీసుకొచ్చి తెలంగాణను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దకుతుందన్నారు. నవాబుపేట శివారులో రైతుల శ్రేయస్సు కోసం నిర్మించిన చెక్ డ్యామును ఈ ప్రాంత ఎమ్మెల్యే నాటు బాంబులతో పేల్చి కూలగొడుతున్నారని ఆరోపించారు.
రజతోత్సవ సభకు చిట్యాల మండలం నుంచి పెద్ద మొత్తంలో హాజరు కావాలని కోరారు. నవాబుపేట గ్రామానికి చెందిన వివిధ పార్టీల యువకులు కలికోట రాజపోషయ్య, పర్లపెల్లి సు మంత్, కలికోట కార్తీక్, సంపంగి రాజకుమార్, ఓర్సు శ్రీకాంత్, కలికోట వాసు, మట్టెవాడ రాజు, పర్లపెల్లి అరుణ్‌కుమార్ గండ్ర సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గొర్రె సాగర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, పార్టీ మండల వరింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేశ్, యూత్ మండల అధ్యక్షుడు నవీన్, టౌన్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీధర్, నాయకులు మడికొండ రవీందర్రావు, ఎరుకొండ రాజేందర్ గౌడ్, కాట్రేవుల కుమార్, పెరుమాండ్ల రవీందర్, ఆయా గ్రామాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.