జనగామ రూరల్, ఏప్రిల్11: ఈనెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ పోస్టర్ను శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జనగామ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు భైరగోని యాదగిరి గౌడ్ అధ్యక్షతన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మేకల కళింగ రాజు మాట్లాడుతూ..బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను రైతులు, కార్మికులు, కర్షకులు, మేధావులు, విద్యావేత్తలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ బల్దే సిద్ధిలింగం, మాజీ రైతు కోఆర్డినేటర్ బూరెడ్డి ప్రమోద్ రెడ్డి, మండల కార్యదర్శి డా. ఎడ్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ తేజావత్ వినోద్, తేల్జేరు ఉప్పలయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు, గుండ్లపల్లి రవి, చాట్ల డానియల్, వంటేరు శ్రీనివాస్ రెడ్డి, సలేంద్ర కొమురయ్య, మైస గౌడ్, అజ్మీర కుమార్, అజ్మీర్ దయాకర్, తదితరులు పాల్గొన్నారు.