టేకుమట్ల, ఏప్రిల్17 : రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్దామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేసేందుకు 200 మంది కార్యకర్తలతో కలిసి గురువారం మండలంలోని రామకృష్ణాపూర్(టీ) నుంచి వెంకట్రావ్పల్లి వరకు బైక్ ర్యాలీ తీశారు.
అనంతరం వెంకట్రావ్పల్లి, బూర్నపల్లి, ద్వారకాపేట, రామకృష్ణాపూర్ (వీ), వెలిశాల, గర్మిళ్లపల్లి, రాఘవాపూర్, పంగిడిపల్లి, పెద్దంపల్లి, ఆశిరెడ్డిపల్లి, టేకుమట్ల, రామకృష్ణాపూర్(టీ), అంకుశాపూర్, సోమనపల్లి, సుబ్బక్కపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం కదా అని పరిపాలన అర్థం చేసుకుని అభివృద్ధి చేస్తరేమో అని ఇన్ని రోజులు కేసీఆర్ మౌనంగా ఉన్నారని అన్నారు. రెండేళ్లు దగ్గరకు వస్తున్నా హామీలు మరిచి అభి వృద్ధిని ఆగం చేస్తున్న రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను 27న జరిగే సభలో కేసీఆర్ ఎండగడుతారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి గౌడ్, మాజీ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, బందెల నరేశ్, కార్మిక శాఖ మండల అధ్యక్షుడు నేరెళ్ల రామకృష్ణాగౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, కొలిపాక రాజయ్య, పోతనవేని ఐలయ్య, పింగిళి వెంకటేశ్వర్‌రెడ్డి, రఘు, దొడ్ల కోటి, నల్లబెల్లి రవీందర్, ఉద్దమారి మహేశ్, నేరెళ్ల శ్రీనివాస్, సునీల్, శంకర్, కుమార్, అక్రమ్, దేవేందర్, రాజు, రాకేశ్, అన్నయ్య, మొండయ్య, రమేశ్, రవి, అఫ్జల్, సమ్మయ్య, చేరాలు తదితరులు పాల్గొన్నారు.
ఎల్కతుర్తి, ఏప్రిల్ 17 : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభ గతంలో వరంగల్, కొంగరకలాన్‌లో జరిగిన సభలకు మించి చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని మాజీ మంత్రి కొప్పు ల ఈశ్వర్ అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను గురువారం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. సభా వేదిక, తదితర ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ రజతోత్సవ సభకు వచ్చేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజ లు ఉత్సాహంగా ఉన్నారన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజలంతా విసుగు చెందారని, అందుకే మళ్లీ కేసీఆర్ నాయకత్వం కావాలని బలంగా కోరుకుంటున్నారని వెల్లడించారు. పార్టీ అవతరించిన తర్వాత నిర్వహించే అతిపెద్ద సభల్లో ఎల్కతుర్తిదే అతిపెద్దదని, గతంలో ఎన్నడూ లేనంత గా ప్రధాన వేదికను తయారు చేయడం ఇందుకు నిదర్శనమని చెప్పారు.
సుమారు 1500 ఎకరాల్లో నిర్వహించే సభకు సిద్ధిపేట-వరంగల్-కరీంనగర్ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ స్థలాల ఏర్పాటు చాలా బాగుందని చెప్పారు. లక్షలాదిగా వచ్చే సభలో కేసీఆర్ అందరికి కనపడేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్, సొసైటీ వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, నాయకులు తంగెడ మహేందర్, గొల్లె మహేందర్, తంగెడ నగేశ్, కడారి రాజు, కొమ్మిడి మహిపాల్‌రెడ్డి, హింగె శివాజీ, జూపాక జడ్సన్, సాతూరి శంకర్, మదార్, మదన్మోహన్రావు, వేముల శ్రీనివాస్, రాజేశ్వర్‌రావు, శ్రీకాంత్యా దవ్, చిట్టిగౌడ్, కోరె రాజుకుమార్, ఉట్కూరి కార్తీక్, సాంబరాజు, రమేశ్, తక్కళ్లపల్లి వినయ్, దిలీప్‌రావు, బొంకూరి కార్తీక్, అనిల్, మురళి పాల్గొన్నారు.
సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా సభా స్థలానికి దగ్గరలోనే పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశాం. వరంగల్-కరీంనగర్-సిద్దిపేట ప్రధాన రూట్లలో పార్కింగ్ స్థలాలను గుర్తిం చాం. వాహనాల రాకపోకలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 10 లక్షల వరకు మంచినీటి బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లకు ఆర్డర్ ఇచ్చాం. అవసరం అనుకుంటే మరిన్ని అందు బాటులో ఉంచుతాం. పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
-వొడితెల సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే