స్టేషన్‌ఘన్‌పూర్/చిల్పూరు, ఏప్రిల్ 10 : కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా నేటి వరకు ఒక్క సంక్షేమ పథకం పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి ఉందని, దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వచ్చిందని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరులో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఘన్పూర్ నియోజకవర్గంలోనే 9 రిజర్వాయర్లను ఏర్పాటు చేసి ప్రతి ఎకరాకు సాగునీరందించిందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని, కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా నేటి వరకు ఒక్క సంక్షేమ పథకం పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. కడియం శ్రీహరి రూ. 100 కోట్లకు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారని రాజయ్య ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ జెండాపై గెలుపొందిన శ్రీహరికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ జెండాపై పోటీ చేసి గెలుపొందాలని అన్నారు. చిన్న గ్రామాలను పైలట్ పథకం కింద ఎంపిక చేసి నేటి వరకు రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇళ్లకు తట్టెడు మట్టి తీసిన దాఖలాలు లేవన్నారు. రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ నాయకులు ప్రతి మండలం నుంచి ఐదు వేల మందిని తరలించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, మాజీ సర్పంచ్ తాటికొండ సురేశ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చల్లా చందర్ రెడ్డి, కనకం గణేశ్, గుర్రం శంకర్, చిట్టిబా బు, చింత శ్రీను, గోవిందు అశోక్, మారపల్లి ప్రసాద్, చిల్పూరు మండల రైతు బంధు మాజీ కోఆర్డినేటర్ జనగామ యాదగిరి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌నాయక్, మాజీ డైరెక్టర్ బత్తుల రాజన్‌బాబు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు నారగోని రాజుగౌడ్, మాజీ ఎంపీటీసీలు మాచర్ల ప్రవీణ్‌కుమార్, ఎడ్ల శ్రీనివాస్, రాజవరం గ్రామ శాఖ అధ్యక్షుడు ఎండీ యాకూబ్‌పాషా, నాయకు లు నారగోని శ్రీనివాస్, నారగోని వెంకన్న, ఇల్లందుల వెంకటస్వా మి, ఎడ్ల మహిపాల్, యూత్ నాయకులు గణపతి, శ్రీనివాస్, శ్రీను, కోటి, వెంకటస్వామి, రవి పాల్గొన్నారు.