జనగామ, జనవరి 5(నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పెంబర్తి నుంచి సూర్యాపేట రోడ్డులోని భ్రమరాంబ కన్వెన్షన్ హాలు వరకు భారీ బైక్ ర్యాలీగా చేరుకుంటారు. మ ధ్యాహ్నం 12 గంటలకు బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యు ల అభినందన, సన్మాన సభలో పాల్గొని గులాబీ శ్రే ణులకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం జిల్లాలోని దాదాపు 6వేల మంది పార్టీ శ్రేణులు పాల్గొనే ఆత్మీ య సమ్మేళనంలో కేటీఆర్ ప్రసంగిస్తారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పరిశీలించారు.
జనగామలో కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్న ఆత్మీయ సమ్మేళనంలో దాదాపు ఆరు వేల మంది బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొంటాయి. మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, ఓడిపోయిన సర్పంచ్, వార్డు అభ్యర్థులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొననున్నారు. జిల్లాలోని గులాబీ శ్రేణులంతా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలి. భవిష్యత్‌లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలను వారికి వివరించి.. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగేలా కేటీఆనఖ శ్రేణులను సన్నద్ధం చేస్తారు.