వరంగల్, జనవరి 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారత రాష్ట్ర సమితి ఖమ్మంలో నిర్వహిస్తున్న సభ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. దేశ రాజకీయాల్లో గుణనాత్మక మార్పు లక్ష్యంగా జరుగనున్న ఈ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కీలక నేతలు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు ఈ సభకు స్వచ్ఛం దంగా తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా కు అనుకుని ఉన్న మహబూబాబాద్ జిల్లా నుంచి అధి క సంఖ్యలో జనం బీఆర్ఎస్ బహిరంగసభకు తరలి వెళ్లనున్నారు. ఈ మేరకు వారం రోజులుగా గ్రామాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ సమావే శాలు నిర్వహించారు. మహబూబాబాద్ ఎంపీ మాలో త్ కవిత జిల్లాలోని ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్ సమన్వయంతో ఖమ్మం బహిరంగసభ కోసం సన్నాహక సమావేశాలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలతోపాటు మండల, గ్రామ స్థాయి బీఆర్ఎస్ కమిటీల ఆధ్వర్యంలో బహిరంగసభకు హాజరుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఖమ్మం సభ ఏర్పాట్ల సమన్వయకర్తగా వ్యవహరించిన మంత్రి హరీశ్‌రావు సైతం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న మొ దటి బహిరంగసభ కావడంతో పార్టీ శ్రేణుల తోపాటు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలుస్తున్నది.
రైతు ఎజెండా…
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేపట్టి రాష్ర్టాన్ని సాధించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న బీఆర్ఎస్ బహిరంగసభకు హాజరయ్యేందుకు అన్ని వర్గాలు ఆసక్తిగా ఉ న్నాయి. రైతు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా ఉన్న నేపథ్యంలో అత్యధిక స్థాయిలో రైతులు బీఆర్ఎస్ బహిరంగసభకు హాజరయ్యే అవకాశం ఉన్నది. తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా రైతు ఎజెండా అమలు చేయాలని బీఆర్ఎస్ చెబుతున్నది. ఈ నేపథ్యంలో రైతులు ఎక్కువ మంది ఖమ్మం బహిరంగసభపై ఆసక్తిగా చూస్తున్నారు. దేశంలోని సంపద సంక్షేమ పథకాల రూపంలో పేదలకు అందాలనే విధానంతో బీఆర్ఎస్ ఉన్నది. ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతోపాటు సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. దేశ వ్యాప్తంగానూ ఇదే ఎజెండా అమలు చేయాలని డిమాండ్ ఉన్న నేపథ్యంలో పేద వర్గాల్లో ఖమ్మం బహిరంగసభపై ఆసక్తి నెలకొన్నది. విద్వేషాలతో ప్రజల్లో విభజన తీసుకున్న వస్తున్న పార్టీలను ఎదుర్కొనే సత్తా ఉన్న బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే విషయంలో యువత ఇష్టంగా ఉన్నారు. దేశాభివృద్ధికి పకడ్బందీగా ప్రణాళిక, సమర్థవంతమైన పాలన అవసరమని ఈ వర్గం ఆశిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మోడల్‌గా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం బీఆర్ఎస్కే ఉన్నదని యువత నమ్ముతున్నది. ఈ నేపథ్యంలో ఖమ్మం బహిరంగసభకు యువత భారీగా తర లి వస్తుందని భావిస్తున్నారు.