మహబూబాబాద్, మే 1(నమస్తే తెలంగాణ) : మానుకోట అభ్యర్థి మాలోత్ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు. బుధవారం రాత్రి ఎంపీ మాలోత్ కవిత నివాసంలో మానుకోట లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు మెజార్టీ వచ్చేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. మన సర్వేలో కవిత భారీ మెజార్టీతో గెలుస్తుందని వచ్చిందని, మరింత కష్టపడితే కవిత గెలుపు నల్లేరు మీద నడకేనని చెప్పారు.
కవిత విజయం కోసం అందరూ సమష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు సమావేశంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తకళ్లపల్లి రవీందర్రావు, సిరికొండ మధుసూదనాచారి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, బానోత్ శంకర్‌నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రేగా కాంతారావు, బానోత్ హరిప్రియా నాయక్, జడ్పీ చైర్పర్సన్లు అంగోత్ బిందు, బడే నాగజ్యోతి, మున్సిపల్ చైర్పర్సన్ పాల్వా యి రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు