నోటీసులు జాన్తా నై
గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమార్కులు వివాదాస్పద స్థలాల్లో మూడు నుంచి నాలుగు అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారం నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నరనే విమర్శలున్నాయి.
- ఆగని అక్రమ నిర్మాణం
- ఆమ్యామ్యాలు అందడంతో మిన్నుకుంటున్న అధికారులు!
సిటీ బ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమార్కులు వివాదాస్పద స్థలాల్లో మూడు నుంచి నాలుగు అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారం నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నరనే విమర్శలున్నాయి.
తాజాగా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ హనుమాన్ గుడి పక్కన ఇంటినెబర్ 1-95లో ఎలాంటి అనుమతులు లేకుండా వివాదంలో ఉన్న స్థలంలో గతంలోనే జీప్లస్ టూ భవనం నిర్మించారు. మొత్తం సుమారుగా 250 గజాల స్థలంలో 120 గజాలు మాత్రమే రెవెన్యూ రికార్డుల్లో ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో ఆ ఇంటికి పన్ను కూడా 120 గజాలకు మాత్రమే వస్తున్నట్లు తెలుస్తున్నది. తాజాగా ఆ ఇంటిపై మరో ఫ్లోర్ నిర్మిస్తున్నారు.
ఈ విషయమై నార్సింగి సర్కిల్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా గతనెల 16న షోకాజు నోటీసులు జారీచేశారు. 15 రోజుల్లో ఇప్పటికే ఉన్న జీప్లస్ టూ భవనంపై అదనపు అంతస్తు ఎందుకు నిర్మిస్తున్నారు? అనుమతులు ఉన్నాయా? అనుమతులు తీసుకోకుంటే నిర్మాణం కూల్చివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. అధికారుల నోటీసులను పట్టించుకోకుండా ఇంటి యజమాని నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే సదరు నిర్మాణంపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి యజమాని నుంచి అధికారులకు ఆమ్యామ్యాలు అందాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

