చిన్నస్వామిలోనే ఐపీఎల్
త్వరలో మొదలుకాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఎడిషన్‌కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు ఆ యాజమాన్యం శుభవార్త చెప్పింది.
- ఐదు మ్యాచ్‌లు ఆడనున్న ఆర్సీబీ
బెంగళూరు: త్వరలో మొదలుకాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఎడిషన్‌కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు ఆ యాజమాన్యం శుభవార్త చెప్పింది. తమ సొంత మైదానమైన చిన్నస్వామిలో ఆర్సీబీ మ్యాచ్‌లు ఆడుతుందా? లేదా? అన్న ఉత్కంఠకు తెరదించుతూ.. రాబోయే సీజన్లో భాగంగా లీగ్ దశలో ఇక్కడ ఐదు మ్యాచ్‌లు ఆడేందుకు తమకు అనుమతి లభించినట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్లో 14 మ్యాచ్‌లు ఆడే జట్లు.. తమ సొంత మైదానంలో 7, ప్రత్యర్థుల వేదికల్లో 7 మ్యాచ్‌లు ఆడతాయి. అయితే లీగ్ దశలో ఐదు మ్యాచ్‌లను చిన్నస్వామిలో ఆడే ఆర్సీబీ.. రెండు మ్యాచ్‌లను మాత్రం రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)లో ఆడనుంది. దీని ప్రకారం ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ కూడా చిన్నస్వామిలోనే (సంప్రదాయం ప్రకారం డిఫెండింగ్ చాంపియన్ తమ హోంగ్రౌండ్లో తొలి మ్యాచ్ ఆడుతుంది) జరుగనుంది. లీగ్ దశ ముగిశాక ప్లేఆఫ్స్‌లో ఒకటి, ఫైనల్ కూడా చిన్నస్వామిలోనే జరుగుతుందా? లేదా? అన్నదానిపై పూర్తి షెడ్యూల్ వెలువడితే గానీ స్పష్టత రాదు. టీ20 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌ల (ఈనెల 5) తర్వాత ఐపీఎల్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

