రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. సన్నాలతోపాటు దొడ్డు వడ్లకూ రూ. 500 బోనస్ చెల్లించాలని, కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా ఉమ్మడి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు చేశారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. పోలింగ్ ముగిసిన తెల్లారే వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు సన్నవడ్లకే బోనస్ ఇస్తామంటున్నదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
– జనగామ(నమస్తే తెలంగాణ)/ఖానాపురం/కేసముద్రం/పాలకుర్తి/వర్ధన్నపేట, మే 16
రైతాంగాన్ని మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు గురువారం జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఖానాపురంలో చేపట్టిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల తర్వాత మాట మారుస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన స్థానిక ఎమ్మెల్యే దొంతి ఎన్నికలు ముగిశాక నోరు విప్పకపోవడం దుర్మార్గమన్నారు. కేసముద్రం మార్కెట్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి రావడానికి అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత మాట మారుస్తున్నాడని అన్నారు.
డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. వర్ధన్నపేటలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేయగా, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మారపెల్లి సుధీర్‌కుమార్ పాల్గొని మాట్లాడారు. హామీలు అమలు చేయకుండా మాటలతో కాలం వెళ్లబుచ్చుతూ రైతులు, ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని అన్నారు. ఆగస్టు 15 వరకు స్థానిక సంస్థలు, సర్పంచ్ల ఎన్నికలు పూర్తి కాను న్నందున ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఆగస్టు 15వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని విమర్శించారు. పాలకుర్తిలోని రాజీవ్ చౌరస్తాలో చేపట్టిన నిరసనలో పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. అన్ని రకాల వడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీలు వేములపల్లి ప్రకాశ్‌రావు, అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీలు మార్గం భిక్షపతి, పుస్కురి శ్రీనివాస్‌రావు, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటనర్సయ్య, తూళ్ల కుమారస్వామి, పస్నూరి నవీన్, నర్సింహానాయక్, తీగాల ధయాకర్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, నాగి శెట్టి ప్రసాద్, జక్క అశోక్, బాల్నె వెంకన్న, శ్రీనివాస్‌గుప్తా, యువరాజ్, రాజుయాదవ్, నాయకులు ఊకంటి యాకుబ్‌రెడ్డి, నీలం దుర్గేశ్, మోడెం రవీందర్‌గౌడ్, కముటం శ్రీనివాస్, కొండ్రెడ్డి రవీందర్‌రెడ్డి, గుగులోత్ వీరునాయక్, శింగంశెట్టి ఏకాంతం, మిట్టగడుపుల మహేందర్, కూన భద్రాద్రి, శతకోటి నరేశ్, బానోత్ వెంకన్న, బుర్ర కుమారస్వామి, జితేందర్‌రెడ్డి, గోపాల్‌రావు,
ఎలేందర్‌రెడ్డి, బండి రజిని, మంగళపల్లి శ్రీనివాస్‌రావు, సోమేశ్వర్రావు, అనిమిరెడ్డి, హామ్మినాయక్, రంగు మల్లయ్య, సిందె రామోజీ, గాంధీనాయక్, పోశాల వెంకన్న, కారుపోతుల వేణు, పోశాల పవన్ కుమార్, కళింగరావు, సతీశ్, పూస మధు, జడ్పీ, మున్సిపల్ చైర్పర్సన్లు భాగ్యలక్ష్మి, పోకల జమున, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు ఎడవెల్లి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు బక్క నాగరాజు, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, కౌన్సిలర్లు బండ పద్మ, అనిత, ప్రేమలతా రెడ్డి, స్వరూప, భూలక్ష్మి, జూకంటి లక్ష్మి, సమద్, బీఆర్ఎస్ నాయకులు ఏబెల్, బక్క నాగరాజు, గుర్రం నాగరాజు, గజ్జెల నర్సిరెడ్డి, సందీప్, తిప్పారపు విజయ్, చెంచారపు పల్లవి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అధికారం కోసం కాంగ్రెస్ పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్య పెట్టింది. ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తామని మాట ఇచ్చి తప్పితే రైతులతో కలిసి బీఆర్ఎస్ ఎక్కడికక్కడ నిలదీస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇస్తామని ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే అంటూ బుకాయిస్తోంది. అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించే వరకు కాంగ్రెస్ పార్టీని నిద్రపోనివ్వం. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రినన్న సంగతి మరిచిపోయి స్థాయి దిగజారి మాట్లాడుతుంటే మంత్రులు అహంకారంతో రెచ్చిపోతున్నారు. 420 హామీలు, 100 రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు ఐదు నెలులు గడుస్తున్నా దిక్కూమొక్కూ లేదు. అబద్ధపు ప్రచారాలు చేసి తప్పుడు కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. పిచ్చి వేషాలు వేస్తే జనాలు సహించరు.
– జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి