బచ్చన్నపేట నవంబర్ 5 : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును బచ్చన్నపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. హైదరాబాద్లోని హరీశ్ రావు నివాసంలో ఆయన తండ్రి సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. హరీశ్ రావును ఓదార్చారు.
కార్యక్రమంలో జనగామ జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బోడిగం చంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి, అలింపూర్ మాజీ సర్పంచ్ నరెడ్ల బాల్ రెడ్డి, మల్లవరం వెంకటేశ్వర్ రెడ్డి, PACS డైరెక్టర్లు కానుగంటి బాలచందర్, వేముల లక్ష్మణ్ గౌడ్, బచ్చన్నపేట పార్టీ పట్టణ అధ్యక్షులు గంధమల్ల నరేందర్, పార్టీ నాయకులు జూకంటి కిష్టయ్య, మన్సాన్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు శాకంపల్లి రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.