నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 1 : కాంగ్రెస్ కుట్రలపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. కాళేశ్వరంపై ఘోష్ కమిటీ నివేదికను నిరసిస్తూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గులాబీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు చేపట్టారు. అమర వీరుల స్తూపాలకు గో దావరి జలాలతో అభిషేకం చేశాయి. బైక్ ర్యాలీలు, నల్ల జెండాలు, కండువాలతో ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహ నం చేసి కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడ్డాయి. హనుమకొండలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, స్టేషన్‌ఘన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నిరసనల్లో పాల్గొని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
భూపాలపల్లిలో పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, ములుగులో నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి, జనగామలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు పోకల జమున, గాడిపెల్లి ప్రేమలతా రెడ్డి, మహబూబాబాద్‌లో మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, నర్సంపేటలో పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ధర్నా చేసి తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ర్టాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
కృష్ణ కాలనీ : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ పటేల్ ఆధ్వర్యంలో సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ అమరవీరుల స్తూపానికి పాలాభిషేకం, కాలేశ్వరం జలాలతో అభిషేకం చేశారు. అనంతరం అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. సీఎం దిష్టి
బొమ్మను దహనం చేయకుండా పోలీసులు అడ్డుపడుతూ బైక్‌పై వేగంగా వచ్చి కటకం జనార్దన్‌ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు. మరికొంతమందిని భూపాలపల్లి పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, మాజీ ఎంపీ పీ కళ్లెపు రఘుపతిరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం అందలమెకిందని, దా న్ని చూసి ఓర్వలేని సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు.
కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్ యాదవ్, సెగ్గం సిద్ధు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ నూనె రాజు పటేల్, మాజీ కౌన్సిలర్లు ముంజంపల్లి మురళీధర్, పూలమ్మ, మంగళ పల్లి తిరుపతి, జకం రవికుమార్, జాగృ తి జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్ రెడ్డి, టీబీజీకేఎస్ బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య, బీఆర్ఎస్ నాయకులు బీబీ చారి, బండారి రవి, సింగన వేణి చిరంజీ వి, మామిడి కుమార్, జోరు ఈశ్వర్, పోలవేణి అశోక్, సుధాకర్, దొంగల ఐల య్య, కరీం, శోభన్, కుమార్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఐలయ్య, రాజు, మహిళా నాయకులు తిరుపతమ్మ, భాగ్యలక్ష్మి, స్వప్న, ప్రేమలత, యూత్ నాయకులు పోలవేణి మహేందర్, యుగేంద్రాచారి, రాజ్ కుమార్, భాసర్, దిలీప్ కుమార్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఉద్దేశపూరితంగా కేసీఆర్ కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, యాళ్ల మురళీధర్ రెడ్డి, తేళ్ల శ్రీను, జేరిపోతుల వెంకన్న, మార్నేని రఘు, షేక్ ఖాదర్ బాబా, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.