కాంగ్రెస్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌కు నిరసనగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు హనుమకొండ జిల్లా కాజీపేట, ములుగు జిల్లా ఏటూరునాగారంలో ధర్నా చేసి, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నించాయి. పోలీసులు అడ్డుకోగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తోపులాట జరిగింది. దీంతో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ఖాకీలు వారిని బలవంతంగా అక్కడి నుంచి లాగి పడేసి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకను కాంగ్రెస్ ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీలో ప్రభుత్వం సస్పెండ్ చేయడం సరికాదని పేర్కొన్నారు.
– కాజీపేట/ ఏటూరునాగారం
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేసినందుకు నిరసనగా హనుమకొండ బీఆర్ఎస్ పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో కాజీపేట చౌరస్తాలో పార్టీ శ్రేణులు శుక్రవారం ధర్నా, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. రోడ్డుపై బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి వ్యతిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేశ్ మాట్లాడుతూ వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి మాటలకు 90% శాతం మోసపోయారని, తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డికి పాలనపై అవగాహన లేదని, కల్లిబొల్లి మాటలు చెప్పి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను వంచించారన్నారు. సీఎంపై ప్రజల తిరుగుబాటు మొదలైందన్నారు.
జగదీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకు ఇచ్చి హామీలను అమలు చేయా లని, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజా పోరాటం మొదలు పెడుతుందని హెచ్చరించారు. కార్యక్ర మంలో బీఆ ర్ఎస్ నాయకులు బుర్ర జనార్దన్ గౌడ్, గబ్బెట శ్రీనివాస్, పాలడుగుల శివకుమార్, కాటాపురం రాజు, తేలు సారంగపాణి, అఫ్జల్, మహ్మద్ సోని, హుస్సేన్, సుంచు అశోక్, శృంగా రపు భిక్షపతి, మహమూద్, వినయ్, సుంచు రఘురాం, దువ్వ నరేశ్, మర్యాల కృష్ణ, పాము రాజేశ్, సుబ్బు, మల్లేష్, మైలారం శంకర్, తండమల్ల వేణు, బండి రాంచందర్, శేఖర్, బాచీ, బొల్లె కుమార్, బస్వ యాదగిరి, కోటీ, సిద్దు, మంద శ్రీనివాస్, రాజ్‌కుమార్, ఇమ్మడి రవి, సిరి పాక కుమారస్వామి, వెంకట్ స్వామి, విజయ్, బాబురావు, మోజెస్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారావు మాట్లాడు తూ కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నదన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. అసెంబ్లీలో స్పీకర్‌ను ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడకున్నా సస్పెండ్ చేశారన్నారు.
చర్చ జరిగితే కాంగ్రెస్ మోసం చేసే బండారం బయట పడుతుందని, బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుందనే భయంతోనే గొడవ చేసి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నద న్నారు. కార్యక్రమంలో ఏటూరునాగారం మండల శాఖ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, కాకులమర్రి ప్రదీప్‌కుమార్, ఖాజాపాషా, తాడూరి రఘు, ఈసం రామ్మూర్తి, వలీబాబా, గండపెల్లి నర్సయ్య, మాదిరి రామయ్య, లొటపెట్టల రాజేశ్, జాడి భోజారావు, వావిలాల పోషాలు, కొండాయి చిన్ని, ముస్తాఫా, మెరుగు వెంకటేశ్వర్లు, శ్రీరాం, రమేశ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.