చేర్యాల, జూలై 18 : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంజూరు చేయించిన ఇందిరమ్మ ఇండ్లకు శుక్రవారం చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లబ్ధిదారులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం మండల తాజా మాజీ అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. అర్హులకు కాంగ్రెస్ నాయకులు ఇండ్లు మంజూరు చేయకపోవడంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి అర్హులైన వారికి పార్టీలకు అతీతంగా ఇండ్లు మంజూరు చేయించినట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు జగన్, యూత్ మండల అధ్యక్షుడు రాజేష్, నాయకులు గిరిధర్, మహేందర్, అతహర్, సత్యనారాయణ, చంద్రమౌళి, రాములు, అసద్,కనకయ్య, బాలనర్సయ్య, రాజు, భాస్కర్, శ్రీకాంత్, భరత్, కిషన్, పవన్ పాల్గొన్నారు.