భూపాలపల్లి రూరల్, నవంబర్ 20: ‘డబుల్’ ఇం డ్ల లబ్ధిదారులేమైనా దొంగ లా?.. వారిపై పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరును బీఆర్ఎస్ నాయకు లు ఖండించారు. గురువా రం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. భూపాలపల్లి పట్టణంలో బుధవారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులను పోలీస్ స్టేషన్లో చెట్టు కింద నిల్చోబెట్టి దొంగలాగా, నేరస్తుల్లా ట్రీట్ చేశారని అన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి లబ్ధిదారుల వివరాలను మున్సిపల్ కార్యాలయం నోటీస్ బోర్డులో అంటించి, ప్రజల అభ్యంతరాలను కోరిన తరువాతే లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారని పేర్కొన్నారు.
ఇప్పుడు జిల్లా అడిషనల్ కలెక్టర్, హౌసింగ్ డిపార్ట్మెంట్, పీడీ అధికారులు రహస్యంగా పోలీస్ బందోబస్తు నడుమ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయడం పనికిమాలిన చర్యగా పరిగణిస్తున్నామన్నారు. L1, L2, L3 కేటగిరీల జాబితాను విస్మరించి డబ్బులు తీసుకొని కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పేర్లను పరిగణలోకి తీసుకోవడాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దీ నికి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, పీడీ, ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. రా నున్న ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారన్నారు. ప్రజలను వంచించే చర్యలు మానుకోవాలని, అర్హులైన లబ్ధిదారుల పక్షాన కోర్టును ఆశ్రయించి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ప్రజల పక్షాన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.