ఆడబిడ్డల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. వారు అన్నిరంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నది. ముఖ్యంగా వడ్డీ లేని రుణాలు అందిస్తూ వారు ఆర్థికస్వావలంబన పొందేలా కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆరు జిల్లాల్లో గతేడాది 50,618 మహిళా సంఘాలకు రూ.2,274కోట్ల రుణాలను అందించడమే కాకుండా వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు వారి భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ‘మహిళా సంక్షేమ దినోత్సవం’ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది.
– మహబూబాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ)
మహబూబాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంక్షేమా నికి పెద్దపీట వేస్తున్నది. మహిళలు అన్ని రంగాల్లో రా ణించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మహి ళలకు వడ్డీలేని రుణాలు అందించి వారి ఆర్థిక పరిపుష్టికి దోహదపడుతున్నది. స్త్రీ నిధి, కల్యాణలక్ష్మి, షాదీ ముబా రక్, కేసీఆర్ కిట్ తదితర పథకాలను ప్రవేశ పెట్టి మహిళా సాధికారతను మాటల్లో కాదు చేతల్లో చూపిస్తోంది. మహిళలకు రికార్డు స్థాయిలో రుణాలను అందించి కొత్త చరిత్ర సృష్టిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన నాటితో పోలిస్తే రుణాలను ఐదింతలు పెంచింది. తొమ్మిది సంవత్సరాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. వేల కోట్ల ను అందించింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ లోని ఆరు జిల్లాల్లో గతేడాది 50,618 గ్రూపులకు రూ. 2,274 కోట్లు అందజేసింది. రుణాలను అందించడమే కాకుండా వాటి వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నది. మహిళలకు ఎలాంటి తనఖాలు లేకుండానే రూ. 20 ల క్షల వరకు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం సమ న్వయం చేస్తోంది.
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిం చడం ద్వారా ఆ కుటుంబం ఇబ్బందులు తొలుగుతా యనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాలకు రుణా లు అందిస్తున్నది. స్త్రీ నిధి పథకం ద్వారా ఒక్క మహ బూబాబాద్ జిల్లాలో 2014 నుంచి 2023 మార్చి వరకు 10 వేల స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 70 వేల మంది మహిళా సభ్యులకు రూ. 369 కోట్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రుణాలు అందజేసింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రుణాలను ఇంటి అవసరాలకు, పిల్లల చదువుల కోసం వినియోగిస్తున్నారని గుర్తించి తీసుకున్న రుణాన్ని వ్యాపారం చేసే దిశగా ప్రభుత్వం ప్రోత్సహించింది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, లోన్ యా ప్లు, ఎక్కువ వడ్డీతో రుణం ఇచ్చే ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ చిట్ఫండ్ సంస్థల ద్వారా రుణం తీసుకోవాల్సిన అవసరం లేకుండా కావాల్సిన రుణాన్ని బ్యాంకర్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్నది. ఎంత మొత్తం అడిగినా బ్యాంకులు రుణాలు ఇవ్వడంతో సంఘాల్లోని సభ్యుల కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయి. ఆయా రుణా లను ఉత్పాదక రంగాలపైనే ఎక్కువగా వెచ్చిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడి పెడుతున్నా రు. పాడి పరిశ్రమ, కుల వృత్తులు, వ్యాపారాల కోసం రుణాలు తీసుకుంటున్నారు.
మహిళల కోసం పథకాలు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అంది స్తున్నది. వారికి ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి రోజూ ఒక గుడ్డు, పాలుతో పాటు 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, కూరగాయలతో ఒక పూట సమతుల్య ఆహారం పెడుతున్నది. సమాజంలో స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న హింసలు, వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి సఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అదే విధంగా గృహహింస, లైంగిక వేధింపులు, స్త్రీల అక్రమ రవాణా, లైంగిక దాడులు, వరకట్న హింసల వాటి నుంచి రక్షణ కల్పిస్తున్నది. అంతర్జాతీయ మహిళా దినో త్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య మహిళా కార్యక్రమానికి శ్రీకా రం చుట్టింది. మార్చి 8న ప్రారంభించిన ఈ కార్యక్రమా న్ని జిల్లాలో మొదటి దశలో ఎంపిక చేయబడిన ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు పరీక్షలు ని ర్వహిస్తున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందజేస్తున్నారు.