పరకాల, అక్టోబర్ 27: కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమైందని, గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో నడికూడ మండలకేంద్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు శుక్రవారం భారీగా బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం చల్లా మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. తెలంగాణ వైపు దేశ ప్రజలు చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో విపక్షాల్లో గుబులు మొదలైందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, మరోసారి రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో పరకాల ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడినిచ తొమ్మిదేండ్లలో పట్టణ రూపురేఖలు మారాయని, అభివృద్ధిలో ముందువరుసలో ఉందన్నారు.
పరకాల గడ్డపై బీఆర్ఎస్ జెండా మరోసారి ఎగరడం ఖాయమన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలే కాదు.. మరో 60 గ్యారెంటీలు ఇచ్చినా తెలంగాణలో అధికారంలోకి రాదని ఎద్దేవా చేశారు. పార్టీలో చేరిన వారిలో కిన్నెర కుమారస్వామి, సీహెచ్ రాజ్‌కుమార్, రాజు, రెడ్డి రవీందర్, కిన్నె రాజు, సీహెచ్ వెంకటేశ్వర్లు, జంగిలి శ్రీకాంత్, కిన్నెర సూరయ్య, గోనెల శ్రీను, ఆకుల కల్యాణ్, కిన్నెర నాగరాజు, తాళ్ల సమ్మయ్య, ఈర్ల సమ్మయ్య, కిన్నెర సారయ్య, గోడిశాల రామకృష్ణ, కిన్నెర దేవేందర్, సంపత్, కేశవ్, ఆలేటి సుభాష్, అల్లి పరమేశ్, గోపగాని రాజు, తాళ్ల సమ్మయ్య, కుక్కల రమేశ్, రావుల రాజు, తాళ్ల రాజు, ఈర్ల మధుకర్, బుర్ర శ్రీను, రాజు, జగన్నాథుల జంపయ్య, బోగిని రాజయ్యతోపాటు మరో 50 మంది ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఊర రవీందర్రావు, ఉపసర్పంచ్ కిన్నెర మణి, నాయకులు ఊర సతీశ్‌రావు, వీర్ల మధుకర్ పాల్గొన్నారు.
సంగెం: యువతీ యువకులు కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మేస్థితిలో లేరని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని జాటోత్తండా నుంచి కాంగ్రెస్, బీజేపీకి చెందిన యువకులు హనుమకొండలోని చల్లా నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని ఆహ్వానించి మాట్లాడారు. పదేళ్లకు ముందు తెలంగాణ ప్రాంతం ఎలా ఉండేదో… ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనలో ఎంత అభివృద్ధి చెందిందో యువత ఆలోచించాలని కోరారు. ఏళ్లతరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్, దశాబ్దకాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ ప్రాంతానికి చేసిందేమీ లేదని ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను నమ్మొద్దని, గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రతిపక్ష నేతలను నిలదీయాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు.
బీజేపీ గ్రామ అధ్యక్షుడు జాటోత్ అనిల్‌కుమార్, ఉపాధ్యక్షుడు జాటోత్ రాజేందర్, యూత్ కాంగ్రెస్ నాయకుడు గుగులోత్ వెంకన్న, నాయకులు జాటోత్ సుధాకర్, రాజ్‌కుమార్, వంశీ, ప్రవీణ్, నాగరాజు, వెంకటేశ్, సాయికుమార్, రాకేశ్, ఈరు, భిక్షపతి ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ మండల ప్రచార కార్యదర్శి రాజేశ్, గ్రామ యూత్ అధ్యక్షుడు జాటోత్ రామ్మూర్తి, లోకేశ్, వెంకటేశ్, మహేశ్, కేతన్, ప్రశాంత్, భరత్ పాల్గొన్నారు.