దామెర/ఆత్మకూరు, మార్చి 11 : ‘రాష్ట్రంలో రైతులు అష్టకష్టాలు పడుతున్న రు. సాగునీరు లేక పంటలు ఎండిపోయి పశువులకు దాణాగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కార ణం’ అని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం దామెర మండలంలోని ఓగ్లాపురంలో, ఆత్మకూరులోని జీఎస్ఆర్ గార్డెన్స్‌లో బీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్ మూడు నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతున్నదని విమర్శించారు. ‘రైతుల పంటలు ఎండుతున్నయ్.. సరి గా కరెంటు రావడం లేదు. రూ.2లక్షల రుణమా ఫీ లేదు. ఏ ఒక్క పథకం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. కాంగ్రె స్ పాలన అంటేనే కరువులు, కష్టాలు అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు’ అని అన్నారు. పరకాల నియోజకవర్గంలో అభివృద్ధి కనబడడం లేదని ప్రస్తు త ఎమ్మెల్యే పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ప్రతీ గ్రామంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కళ్లకు కనబడుతున్నదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటుతున్నా ఇం కా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. పల్లెలు, పట్టణాల్లో నీళ్లు లేక ప్రజలు ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కరువు పరిస్థితి లేదన్నారు. మేడిగడ్డ బరాజ్‌లో మూడు పిల్లర్లు కుంగితే మరమ్మతులు చేయాల్సింది పోయి కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని దుష్ప్రచారం చేయ డం సరికాదన్నారు. సమావేశంలో ఎంపీ పీ కాగితాల శంకర్, వైస్ ఎంపీపీలు జాకీర్‌అలీ, రేవూరి సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పోలం కృపాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బొల్లు రాజు, ఆత్మకూరు టౌన్ అధ్యక్షుడు పాపని రవీందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, ఎంపీటీసీ బీరం రజినీకర్‌రెడ్డి, అధ్యక్షుడు గండు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ముదిగొండ కృష్ణమూర్తి, గరిగె కృష్ణమూర్తి పాల్గొన్నారు.