మరిపెడ, ఆగస్టు 26 : రైతులు క్యూలో పడిగాపులు పడితే ఒకే యూరియా బస్తా ఇస్తున్నారని, దీంతో పంటలు ఎలా సాగు చేయా లో తెలియక అసహనానికి గురై ఆందోళనలు చేస్తున్నారని, వారి కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా?.. అని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఖమ్మం-వరంగల్ రాష్ట్ర రహదారిపై బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో మరిపెడ, చిన్నగూడూరు మండలాలకు చెందిన రైతులు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆ యన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పాల్గొని మాట్లాడారు.
యూరియా కొరతతో రైతులు రోడ్డెక్కుతుంటే వ్యవసాయంపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలిచ్చి అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని అన్నారు. ఎక్కడిక్కడ ప్రమజాప్రతినిధులను నిలదీస్తే తప్ప రైతుల పరిస్థితి మారే అవకాశం లేదన్నా రు.
అరకొరగా యూరియా పంపిణీ చేస్తూ రైతుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని రెడ్యానాయక్ అన్నారు. యూరియా కొరతపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతులను ఇబ్బందులకు గురిచేయడం సిగ్గుచేటని అన్నారు. డోర్నకల్ ప్రజలు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ఎమ్మెల్యే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారని అన్నారు.
గత ప్రభుత్వంలో కేసీఆర్ ముందు చూపుతో రైతులకు యూరియా కొరత లేకుండా చూశారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వంలో రైతులు క్యూలో చెప్పులు పెట్టుకునే దుస్థితి వచ్చిందని, మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయని అన్నారు. సకాలంలో యూరి యా పంపిణీ చేసి రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో వారితో కలిసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డీఎస్ రవిచంద్ర, ఓడీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుగులోత్ వెంకన్న, గుగులోత్ రాంబాబు, తేజావత్ రవీందర్, గాదె అశోక్ రె డ్డి, బాల్ని మాణిక్యం, అయూబ్ పాషా, నామ సైదులు, వల్లూరి చె న్నారెడ్డి, డీఎస్ రాంసింగ్, బంటు ఉపేందర్, దుండి మురళి, పానుగోతు వెంకన్న, లతీఫ్, బాలాజీ, వస్రం, దిగజర్ల శ్రీనివాస్, గోల్కొం డ వెంకన్న, వెంకన్న, భద్రయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.